Friday, November 22, 2024

గణనీయమైన వృద్ధిని నవెూదుచేసిన అలీస్‌ బ్లూ

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : క్యాలెండర్‌ సంవత్సరం మొదటి అర్ధభాగంలో అలీస్‌ బ్లూ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. ఈ కంపెనీ తమ అన్ని వాణిజ్య విభాగాలలోనూ మొత్తంమీద 18శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆధునీకరించిన ట్రేడింగ్‌ యాప్స్‌, పరిష్కారాల ద్వారా వినియోగదారులకు తగిన సౌకర్యం ఇది అందిస్తుంది. ఈ సంవత్సరపు మొదటి ఆరు నెలల కాలంలో కొన్ని విభాగాలు అసాధారణ వృద్ధి సాధించాయి. గత సంవత్సరంతో పోలిస్తే 2022 మొదటి ఆరు నెలల కాలంలో 31శాతం వృద్ధి నమోదు చేసింది. అదే రీతిలో బంగారం ట్రెండింగ్‌లో 21శాతం, డెరివేటివ్స్‌ 13శాతం, ఈక్విటీ ట్రేడింగ్‌లో 9శాతం వృద్ధి నమోదు చేసింది.

ఈ సందర్భంగా అలీస్‌ బ్లూ ఫౌండర్‌, సీఈవో సిద్ధవేలాయుధం.ఎం మాట్లాడుతూ స్థిరంగా ఈ కంపెనీ మెరుగైన ట్రేడింగ్‌ యాక్టివిటీ-ని చూస్తుందన్నారు. ఇది మహిళా ట్రేడర్లతో పాటు-, నూతన మదుపరుల నుంచి ట్రేడింగ్‌ యాక్టివిటీ- చూస్తోందని తెలిపారు. ఇది క్యాపిటల్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి ఆసక్తికి ప్రతిరూపంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. తమ సాంకేతిక ఆధారిత ప్లాట్‌ఫామ్స్‌ యువతరం తమ మొబైల్‌ ఫోన్ల నుంచి నేరుగా మార్కెట్‌లను చేరుకునే అవకాశం అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement