Tuesday, November 26, 2024

ఎయిర్‌ టెల్‌ నికర లాభం 2,145 కోట్లు.. అంచనాను మించిన ఫలితాలు

ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో అంచనాలను మించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికాని కి 2,145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోల్చితే లాభం 89 శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ నికర లాభం 1,134 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం కూడా 21.9 శాతం వృద్ధి చెంది 34,527 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 28,326 కోట్లుగా ఉంది. ఒక యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) కూడా 183 రూపాయల నుంచి 190 రూపాయలకు పెరిగినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ చందాదారుల సంఖ్య 500 మిలియన్లు చేరింది. భారత్‌లో ఎయిర్‌ టెల్‌ ఆదాయం 22 శాతం పెరిగి 24,333 కోట్లుగా నమోదైంది. మొబైల్‌ సర్వీసెస్‌ ఆదాయం 25 శాతం పెరిగింది. కంపెనీ త్వరలోనే దేశమంతా 5జీ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ ఈ సందర్బంగా మాట్లాడుతూ చెప్పారు. తమ వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని 5జీ ద్వారా అందిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి తక్కువ కాల్‌ రేట్ల కారణంగా తక్కువ రిటర్న్‌ ఆఫ్‌ క్యాపిట్‌ ఎంప్లాయిపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. దేశంలో డిజిటల్‌ విస్తరణకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement