దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో కీలక మార్పులు చేసింది. కంపెనీ ప్లాన్స్ జాబితా నుంచి కొంతకాలంపాటు పక్కనపెట్టిన రూ.199 ప్లాన్‌ను పున:ప్రవేశపెట్టింది. అయితే డేటా, వాలిడిటీ బెనిఫిట్స్ విషయంలో సవరణలు చేసింది. ఈ ప్లాన్‌పై గతంలో 24 రోజుల వ్యాలిడిటీ ఉండగా ఇప్పుడు దానిని 30 రోజులకు పొడగించింది. మరోవైపు గతంలో రోజుకు 1 జీబీ డేటా అందించగా.. ప్రస్తుతం మొత్తం డేటాను 3జీబీకి కుదించింది. డేటా పూర్తయిన తర్వాత స్పీడ్ 50ఎంబీపీఎస్‌కు పడిపోతుంది.
ఇక అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లను కొనసాగిస్తోంది. రోజుకు గరిష్ఠంగా 100 మెసేజీలు మాత్రమే పంపించుకునే వీలుంటుంది. వీటితోపాటు సబ్‌స్క్రైబర్లు ‘హలో ట్యూన్స్’, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా పొందవచ్చు. ఎస్‌ఎంఎస్‌లు పూర్తయిన తర్వాత లోకల్ ఎస్‌ఎంఎస్, ఎస్‌టీడీ ఎస్‌ఎంఎస్‌లకు రూ.1, రూ.1.5 చొప్పున ఛార్జీలు పడతాయని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌పై వినియోగదారులు ఈ ప్లాన్ పొందొచ్చు.