కేరళలోని వాణిజ్య కేంద్రమైన కొచ్చిని ఖతార్ రాజధాని దోహాతో కలుపుతూ అక్టోబర్ 23 నుంచి రోజువారీ నాన్‌స్టాప్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌ఇండియా ఆదివారం తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఏఐ953 మధ్యా#హ్నం 1:30 గంటలకు బయలుదేరుతుంది. మధ్యా#హ్నం 3:45 గంటలకు దోహా చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఏఐ954 దోహా నుండి సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి 11:35 గంటలకు కొచ్చిలో దిగుతుంది.
”ఎ320 నియో ఎయిర్‌క్రాప్ట్nతో నడిచే ఈ విమానంలో 162 సీట్లు (ఎకానమీలో 150, బిజినెస్ క్లాస్‌లో 12) అందుబాటులో ఉంటాయి” అని సంబంధిత అధికారి తెలిపారు. కొత్త ఎయిర్‌క్రాప్ట్nలతో తన విమానాలను పెంపొందించుకుంటూ దేశీయ, అంతర్జాతీయ రంగాలలో కనెక్టివిటీని విస్తరించేందుకు, ఫ్రీక్వెన్సీని పెంచడానికి ఎయిర్ ఇండియా నిబద్ధతకు అనుగుణంగా ఈ కొత్త ప్రయోగం ఉంది” అని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు.