టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా కొత్తగా 100 విమానాలకు ఆర్డర్ ఇచ్చినట్లు సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో 90 ఏ320 విమానాలు, 10 వైడ్ బాడీ ఏ350 విమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం వంద విమానాలను యూరోపియన్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
గత సంవత్సరం ఆర్డర్ ఇచ్చిన 470 విమానలకు ఇవి అదనమని తెలిపింది. ఎయిర్ ఇండియా 2023 ఫిబ్రవరిలో 250 విమానాలకు ఎయిర్ బస్‌కు, 220 విమానాల కొనుగోలుకు బోయింగ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది.
వీటికి అదనంగా కంపెనీ మరో 370 విమానల ఆర్డర్ ఇచ్చే ఆప్షన్‌ను కలిగి ఉందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ (సీసీటీఓ) నిపున్ అగర్వాల్ తెలిపారు. ఎయిర్ ఇండియా మొత్తం 840 విమానాల కొనుగోలు ఆర్డర్ ఇచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు.
కొత్త విమానాల ఆర్డర్‌తో ఎయిర్ ఇండియా అనేక కొత్త మార్గాల్లో సర్వీస్‌లు నడిపేందుకు అవకాశం ఏర్పడుతుందని, పెరుగుతున్న విమానయాన రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఇచ్చిన 100 విమానాల ఆర్డర్‌తో మొత్తం ఎయిర్‌బస్‌కు 344 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిన ట్లు తెలిపింది.
ఇందుల కంపెనీ 6ఏ350 విమానాలను డెలివరీ చేసింది. బోయింగ్‌కు 220 వైడ్ బాడీ విమానాలను ఆర్డర్ ఇస్తే, ఇంకా కంపెనీ నుంచి 185 డెలివరీ కావాల్సి ఉన్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది. 2027 నాటికి మొత్తం 300 కొత్త విమానాలు సమకూరుతాయని తెలిపింది.