Friday, November 22, 2024

ఎయిర్‌ ఇండియాలో ప్రీమియం ఎకానమీ సీట్లు.. 4 క్యాబిన్‌ క్లాస్‌లు అందిస్తున్న సంస్థ

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా ఎంపిక చేసిన మార్గాల్లో, ఎంపిక చేసిన విమానాల్లో ప్రీమియం ఎకానమీ సీట్లను ఆఫర్‌ చేస్తోంది. విమానాల్లో ఫస్ట్‌ క్లాస్‌, బిజినెస్‌, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ ఇలా 4 క్యాబిన్‌ క్లాస్‌లను అందిస్తున్న ఏకైక భారతీయ విమానాయన సంస్థగా ఎయిర్‌ ఇండియా నిలిచింది. ప్రారంభ దశలో బోయింగ్‌ 777-200 ఎల్‌ర్‌ విమానాలు నడిచే బెంగళూర్‌-శాన్‌ప్రాన్సిస్కో, ముంబై-శాన్‌ప్రాన్సిస్కో, ముంబై-న్యూయార్క్ రూట్స్‌లో ప్రీమియం ఎకానమి సీట్లు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌ ఇండియా తెలిపింది.

అందుబాటు ధరల్లోనే మెరుగైన సౌకర్యాలు కావాలని ప్రయాణికులు కోరుకుంటున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలి పింది. త్వరలోనే మరిన్ని మార్గాల్లో నడిచే విమానాల్లోనూ ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఎయిర్‌ ఇండియా సీఈఓ, ఎండీ కాంబెల్‌ విల్సన్‌ తెలిపారు. ప్రీమియం ఎకానమీ క్లాస్‌ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా చెక్‌ ఇన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. చెక్‌-ఇన్‌ బ్యాగేజీలపై ప్రయారిటీ ట్యాగ్‌ వేస్తారు. విమానాల్లోకి ముందుగా ఆహ్వానిస్తారు.

ఈ క్లాస్‌లో క్యాబిన్‌ వెడల్పాటి సీట్ల తో పెద్దగా ఉంటుంది. 5 అంగుళాల రిక్లైన్‌, అడ్జస్టబుల్‌ లెగ్‌ రెస్ట్‌, ఫుట్‌ రెస్ట్‌లు ఉంటాయి. అదనపు లెగ్‌ రూం వల్ల సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. అందమైన ఉచిత టీయూఎమ్‌ఐ అమ్నెటీ కిట్‌ ఇస్తారు. వీటిని ఎయిర్‌ ఇండియా కోసమే ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఇందులో విమాన సాక్స్‌లు, లిప్‌ మాయిశ్చర్‌, పెన్‌, కార్పెట్‌ స్లిప్లర్లు ఉంటాయి. ఇన్‌ ప్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఉపయోగించుకునేందుకు హెడ్‌ఫోన్స్‌ ఇస్తారు. వెల్కమ్‌ డ్రింక్‌ ఇస్తారు. ఎంపిక చేసిన మూడు మీల్స్‌, అల్కాహాల్‌, నాన్‌-ఆల్కహాల్‌ పానీయాలు, ఇతర ఆహారం అందిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement