Friday, November 22, 2024

HYD: ప్రతి రంగంలోనూ కొత్త ఆవిష్కరణలకు ఉత్ప్రేరకంగా ఏఐ : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైద‌రాబాద్ : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE: 539607)లో జాబితా చేయబడిన, హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం కలిగిన బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ (బిసిఎస్), నాలుగు కృత్రిమ మేధస్సు (ఏఐ)- ఆధారిత ఉత్పత్తులను-బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లురా, ఎడ్యు జెనీ, బయోస్టర్ ని సోమవారం భారతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వినూత్న ఉత్పత్తులను ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఐటి, ఈ అండ్ సి, పరిశ్రమలు అండ్ వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన విడుదల కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా, మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా గౌరవ అతిథిగా హాజరయ్యారు. బిసిఎస్ చైర్మన్ జానకి యార్లగడ్డ మాట్లాడుతూ… తమ ప్రతి ఉత్పత్తి నిజమైన వైవిధ్యాన్ని కలిగించే పరిష్కారాలను రూపొందించడంలో కంపెనీని నడిపించే వినూత్న స్ఫూర్తిని ఎలా కలిగి ఉంటుందో వివరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఐటి మంత్రి మాట్లాడుతూ… ఆరోగ్య సంరక్షణలో ఏఐ అంటే, సాంకేతికత మాత్రమే కాదు, ఇది జీవితాలను మార్చడానికి సంబంధించినదన్నారు. కృత్రిమ మేధస్సు శక్తిని ఉపయోగించడం ద్వారా మనం రోగనిర్ధారణను మెరుగు పరచవచ్చన్నారు. చికిత్సను వ్యక్తిగతీకరించవచ్చన్నారు. మెరుగైన ఫలితాలను సాధించవచ్చని, అంతిమంగా, ఆరోగ్య సంరక్షణను ప్రతి వ్యక్తికి సమర్ధవంతంగా, మరింత అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు. కలిసికట్టుగా మనం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నామన్నారు.

బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బిసిఎస్) చైర్మన్ శ్రీమతి జానకి యార్లగడ్డ మాట్లాడుతూ… ఏఐ అనేది ప్రతి రంగంలోనూ కొత్త సరిహద్దులకు తీసుకువెళ్లడంలో ఉత్ప్రేరకంగా నిలుస్తుందన్నారు. ఆవిష్కరణ, సామర్థ్యాన్ని నడిపిస్తుందన్నారు. తాము ఏఐని మన దైనందిన జీవితంలోకి మిళితం చేర్చటం ద్వారా తాము వ్యక్తులు, సంస్థలను తమ పూర్తి సామర్ధ్యాలను ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ సాంకేతికత ఉత్పాదకతను పెంపొందించడమే కాకుండా, సృజనాత్మకత, సహానుభూతి, పురోగతిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందన్నారు. భవిష్యత్ ఆశాజనకంగా వుందన్నారు. మానవాళికి ప్రయోజనం కలిగించే విధంగా మనం బాధ్యతాయుతంగా ఏఐని ఉపయోగించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement