నేను చేయగలను” ”నేనూ చేయగలను.” అనంటే అది ఆత్మ విశ్వాసం అవుతుంది. ఆత్మ విశ్వాసం విజయాని కి ఎంతో అవసరం కూడా. ”నేనే చేయగలను.” అనంటే అది అహంకారం. అలాగే ”నాకే అన్నీ తెలుసు. నేనే మేధావిని” అను కుంటే అదీ అహంకారమే. అది మనల్ని అథ:పాతాళానికి తో స్తుంది. చరిత్రహనులుగా మారుస్తుంది. భౌతికంగానే కాదు ఆ ధ్యాత్మికంగాను అహం అనేది మానవుని ప్రగతికి, పురో గతికి, అభివృద్ధికి అడ్డుకట్ట అవుతుంది. పెద్ద అవరోధంగా మారుతుంది.
ఆంగ్లంలో అహాన్ని ”ఊఏక్ష” అంటారు . ఊ అంటే ఎడ్జిం గ్, ఏ అంటే గాడ్, క్ష అంటే అవుట్. మొత్తంగా ఊఏక్ష ఉంటే… ఎడ్జింగ్ గాడ్ అవుట్. అంతరంగంలో అంత: స్వరూపునిగా ఉన్న భగవంతుడ్ని, నీకు తెలియకుండానే బయటకు పంపివే స్తుంది అహంకారం. అహంకారం అంతటి ప్రమాదకరమైం ది. అహంకారులు అహంభావులు ఎందరో యీ అహంకారం వల్లే నామ రూపాల్లేకుండా మసైపోయారు. రావణాసురుడు, హరణ్యకశిపుడు, హరణ్యాక్షుడు, దుర్యోధనుడు యిలా యో ధానుయోధులు ఎందరో యీ అహం కారణంగానే ఎందుకూ కొరగాని వాళ్ళైపోయారు. మహామహా వరాలు పొందామని కొందరు. తపస్సులు చేసి భగవదనుగ్రహం పొందామని కొందరు. అపారమైన బలం, అనంతమైన బలగం ఉన్నాయని కొందరు, యీ అహం కారణంగానే ఎందుకూ కొరవడక కొరగాని వాళ్ళయ్యారు. అస్తిత్వం కోల్పోయారు.
అదే సమయంలో నిరంహకారంతో, అణకువ, వినమ్రత, వినయం కలిగి ఉంటే మామూలు వ్యక్తులు కూడా మహాత్ములు అవుతారనేది జగద్విదితమే.
అహం ఉంటే మనుషులే కాదు ఆకులు అలములు యితరత్రా వస్తువులు కూడా గౌరవం కోల్పోతాయి. స్థాయినీ, స్థానాన్ని కోల్పోయి నిరాదరణకు గురౌ వుతాయి.
ఓసారి ఆకులన్నీ సభ పెట్టుకున్నాయి. ముందుగా మామిడాకు తలెగరేస్తూ మాట్లాడింది. నేను ప్రతి శుభానికి, శుభకార్యానికీ ఎంతో అవసరం. పెళ్ళైనా, పవి త్రమైన దైవ కార్యక్రమమైనా జరుగుతుంటే, శుభానికి ప్రతీకగా మామిడాకులనే ఎంచుకుంటారు. ఉత్కృష్టమైన మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ నేనే అవసరం. ఆఖరుకి దేవుడి విగ్రహాలను, పటాలను కూడా నేను లేకుండా పెట్టరు. భగవంతుడ్ని కూర్చోబెట్టాలంటే, ఆ దేవుళ్ళ క్రింద శుభాన్ని తేవడానికి మామి డాకు (అంటే నేను) ఉండాల్సిందే. అంతటి ఉత్కృష్టమైన జన్మ నాది అని మావి డాకు అంది. అయితే గుమ్మాలకీ ద్వారాలకీ తలకిందకు వ్రేలాడుతూ, తలకిందు లుగా వేలాడటమే మామిడాకు స్థానం అనే నిజాన్ని మర్చిపోయింది. అంటే బ్రతు కు తలకిందులైంది అనే విషయాన్ని గ్రహంచ లేకపోయింది మామిడాకు.
తర్వాత అరిటాకు నిల్చొంది. తన ప్రతిభను చెప్పుకోవటం మొదలుపెట్టిం ది. దేవునికి ప్రసాదం నివేదన అరటి ఆకులోనే చేస్తారని గొప్పగా చెప్పుకుంది. దైవ కార్యాలైన పూజలు, వ్రతాలలో అరిటాకుకి ఎంతో విలువ ఉంటుందని చెప్పింది. పెళ్ళిళ్ళలో, పేరంటాలలో, అరిటాకులలో భోజనాలు వడ్డించితే, సంప్రదాయ పద్ధతిలో భోజనాలు పెట్టారనే గొప్ప పేరు, ఆ భోజనాలకు వస్తుందని గర్వంగా తలెగరేసింది అరిటాకు.
అయితే ప్రసాద వితరణ సమయంలోను, పెళ్ళిళ్ళు పేరంటాలులో భోజనా లకు అవసరార్ధం అరటాకుని వాడినా, భోజనాలయ్యాక, ప్రసాదం ఆరగించడం అయ్యాక, ఆ అరిటాకు స్థానం ‘ఎంగిలాకుల కుప్పే’ అనే విషయాన్ని అరిటాకు మర్చిపోయింది. అరిటాకుకి ఉన్న అ#హం కారణంగానే, అరటి ఆకు స్థానం ఎంగి లాకుల కుప్ప అయ్యిందనే అసలు నిజాన్ని గ్రహంచ లేకపోయింది అరిటాకు.
తర్వాత కరివేపాకు వంతు వచ్చింది. ఎన్నో రుచికరమైన వంటలకు రుచి రావాలంటే, సుగంధ భరితం అవ్వాలంటే కరివేపాకు ఎంతో అవసరం. కరివేపా కు లేకపోతే ఆ వంటకానికి సార్ధకత రాదు. అంతటి ప్రాముఖ్యత కలదాన్ని నేను. అని కరివేపాకు అ#హం ప్రదర్శించింది. అవునవును. అవసరం అయిపోయాక వండిన ఆ వంటకాన్ని తింటున్నప్పుడు, నిన్ను (కరివేపాకును) తీసి అవతల పారేస్తారు. అంత నీచమైన స్థానం నీది అని మిగతా ఆకులు వినబడీ వినబడనట్లు గొణుక్కున్నాయి.
తర్వాత తమలపాకు మాట్లాడింది. తాంబూల సేవనం నేను (తమలపాకు) లేనిదే జరగదు. మంచి సువాసనతో నోళ్ళనన్నింటినీ పండిస్తాను. తాంబూల సేవనానికి మానవ జీవనంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అదంతా నా వలనే. అని అహంకార పూరితంగా తన గొప్పదనాన్ని తానే చెప్పుకుంది తమలపాకు. అవు నవును. తాంబూల సేవనం అయింతర్వాత, పిప్పిగా మిగిలిపోయిన నిన్ను, ఉమ్ముగా ఊసి పారేస్తారు. అదీ నీ స్థానం. అని హాస్యంగా నవ్వుకుంటూ ఎగతాళి చేసాయి మిగతా ఆకులు.
తమలపాకు తర్వాత మరే ఆకు మాట్లాడటానికి నిలబడ లేదు. అయితే విన మ్రంగా కూచుని అంతా వింటున్న ఓ ఆకు, తులసి ఆకు వైపు చూసింది. తులసి ఆకుని తన గొప్పదనాన్ని చెప్పుకోమని తులసి ఆకుకి ఎంతగానో చెప్పింది. తులసి ఆకు మాత్రం ససేమిరా మాట్లాడలేనని ఖరాఖండిగా చెప్పింది. మాట్లాడవలసిం దే అని అన్ని ఆకులూ తులసి ఆకుని బలవంతం చేసాయి. చేసేదేమీ లేక మాట్లాడ టానికి సిద్ధపడింది తులసి ఆకు. ఎంతో వినమ్రంగా నిలుచుని ఇలా అంది.
”నేను చాలా చిన్న ఆకుని. నా తల్లి తులసి మొక్క కూడా చాలా చిన్నది. ఆకా రంలోను, అన్నింటిలోను నేను చాలా చిన్నదానిని. నాకేం ప్రత్యేకత ఉంటుంది? నాకు ఏవిధమైన ప్రత్యేకతా లేదు.” అని చెప్పి నెమ్మదిగా కూచుంది.
తులసి ఆకులో అణువణువునా ఏమాత్రం అహంకారం, అహంభావం కనిపించలేదు.
అందుకే తులసి ఆకు అంత పవిత్రమైంది అయ్యింది. అమ్మ స్థానం పొం దింది. ”తులసమ్మ”గా పిలవబడుతోంది. పూజ్యనీయురాలైంది. ప్రతివారి చేత ప్రతి నిత్యం పూజలు అందుకుంటోంది.
అందుకనే అహాన్ని వదులుదాం.
అహంభావాన్ని దూరం పెడదాం. ప్రశాంతంగా జీవిద్దాం.
అహం అనర్ధదాయకం
Advertisement
తాజా వార్తలు
Advertisement