Friday, October 4, 2024

HYD: హరిత జిల్లాగా శ్రీ సత్యసాయిని మార్చేందుకు ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ కృషి

హైద‌రాబాద్ : దేశంలోని ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ (ఏజీ అండ్ పీ ప్రథమ్), ప్రశాంతి నిలయం, పుట్టపర్తిలోని గృహాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), అనంతపురం-కడప ప్రాంతంలో రవాణా వాహనాలకు సీఎన్జీని సరఫరా చేయడానికి ప్రత్యేకమైన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ (సీఎన్జీ)ను డీ-కంప్రెసర్ యూనిట్ (డీసీయూ)తో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ – మేనేజింగ్ ట్రస్టీ, ఆర్.జె.రత్నాకర్, శ్రీ సత్యసాయి జిల్లా, పోలీస్ సూపరింటెండెంట్, వి.రత్న, ఐపీఎస్ తో పాటుగా ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ (ఏజీ అండ్ పీ ప్రథమ్) సీనియర్ మేనేజ్‌మెంట్ బృందం – చిరదీప్ దత్తా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ (ఏజీ అండ్ పీ ప్రథమ్) సుశీల్ జాద్, ప్రెసిడెంట్ అండ్ జనరల్ కౌన్సెల్, ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ (ఏజీ అండ్ పీ ప్రథమ్) పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఆర్.జె రత్నాకర్ మాట్లాడుతూ…. మన జిల్లాలో, ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ ప్రత్యేకమైన సీఎన్జీ తో కూడిన డీసీయూ స్టేషన్‌ను ప్రారంభించడం ద్వారా స్వచ్ఛ ఇంధనం నూతన యుగాన్ని స్వాగతిస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. ఈ సదుపాయం కేవలం కార్బన్ పాదముద్రను తగ్గించడమే కాకుండా మన రవాణా నెట్‌వర్క్‌ను సైతం మెరుగుపరుస్తుందన్నారు.

- Advertisement -

ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ, డిప్యూటీ రీజినల్ హెడ్ – చిరాగ్ పటేల్ మాట్లాడుతూ… పర్యావరణ అనుకూల వ్యవస్థలపై ప్రపంచం అధికంగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో భారతదేశంలో హరిత గృహాలు, పర్యావరణ అనుకూల మొబిలిటీకి మార్గం సుగమం చేయడానికి ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ కట్టుబడి ఉందన్నారు. అధునాతన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మౌలిక సదుపాయాల త‌మ వేగవంతమైన విస్తరణ ఈ మిషన్ పట్ల త‌మ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement