Tuesday, November 12, 2024

Stock Markets : రెండో రోజూ స్టాక్ మార్కెట్ల‌ దూకుడు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రెండో రోజు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కాగా నిఫ్టీ 100 పాయింట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈ క్రమంలో ఉదయం 10.12 గంటల నాటికి సెన్సెక్స్ 512 పాయింట్లు లాభపడి 74,892 పరిధిలో ట్రేడవగా, నిఫ్టీ 158 పాయింట్లు వృద్ధి చెంది 22,774 స్థాయి వద్ద ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 205 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకంగా 1231 పాయింట్లు లాభపడింది.

ఇక రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 2.98 శాతం లాభాలతో ముందుండగా, పీఎస్‌యూ బ్యాంక్ (2.62 శాతం), మీడియా (2.02 శాతం) లాభపడ్డాయి. ఇది కాకుండా ONGC, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, BPCLలో లాభాలు నమోదయ్యాయి. హెచ్‌యూఎల్, బ్రిటానియా షేర్లు నష్టాలను చవిచూశాయి.

మరోవైపు అంతర్జాతీయ సూచీలైన డౌ ఫ్యూచర్స్ ఫ్లాట్‌గా ఉన్నాయి. నిక్కీ 450 పాయింట్లు బలపడింది. అదే సమయంలో బుధవారం అమెరికన్ మార్కెట్లలో బలమైన పెరుగుదల కనిపించింది. టెక్ స్టాక్స్‌లో బలమైన పెరుగుదల కారణంగా నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 జీవిత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. నాస్‌డాక్ 330 పాయింట్లు ఎగబాకగా, డౌ జోన్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement