Tuesday, November 19, 2024

Aether Energy | విశాఖలో 100 యూనిట్ల అమ్మకం

విశాఖపట్నం : భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఏథర్ ఎనర్జీ, విశాఖపట్నంలో నోవాటెల్‌లో నేడు నిర్వహించిన మాస్ డెలివరీ కార్యక్రమంలో 100 ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్‌లను డెలివరీ చేసింది. విశాఖపట్నంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన రిజ్టాలో ఇదే అతిపెద్ద సింగిల్ డే డెలివరీ.

ఈ సందర్భంగా ఏథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రవ్‌నీత్‌ సింగ్‌ ఫోకెలా మాట్లాడుతూ, ‘‘నేడు విశాఖపట్నంలో 100 రిజ్టా స్కూటర్లను డెలివరీ చేసినందుకు సంతోషిస్తున్నాము. విశాఖపట్నంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ వృద్ధితో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ కూడా అభివృద్ధి చెందుతుంది.

అలాగే, విశాఖపట్నం ఫ్యామిలీ ఫోకస్డ్ మార్కెట్ కావడంతో రిజ్టాకు మంచి స్పందన వస్తోంది. రిజ్టా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయగా, ఇది సౌకర్యం, సౌలభ్యం మరియు భద్రతకు హామీ ఇస్తుంది. ఇది నమ్మదగిన మరియు ఆచరణాత్మక స్కూటర్. రోజువారీ రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తూ, కుటుంబ వినియోగ అవసరాలకు తగిన సాంకేతిక లక్షణాలను కలిగి ఉంది.

రిజ్టా రెండు మోడల్‌లు మరియు మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: రిజ్టా S మరియు రిజ్టా Z 2.9 kWh బ్యాటరీతో మరియు టాప్-ఎండ్ మోడల్ రిజ్టా Z 3.7 kWh బ్యాటరీ కలిగి ఉంటుంది. అలాగే 2.9 kWh వేరియంట్‌లు 123 కిమీ పరిధిని కలిగి ఉండవచ్చని అంచనా వేయగా, 3.7 kWh వేరియంట్ 159 కిమీ పరిధిని అందిస్తుంది. రిజ్టా పెద్ద మరియు సౌకర్యవంతమైన సీటును, 56 లీటర్ల స్టోరేజ్‌ను అందిస్తుంది.

దీనితో పాటు 34 లీటర్ల అండర్ సీట్ కెపాసిటీ మరియు ఐచ్ఛిక 22లీటర్ల ఫ్రంక్ యాక్సెసరీతో సహా. ఇది పెద్ద ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉండడంతో రైడర్‌కు తగినంత లెగ్ స్పేస్‌ను అందిస్తుంది. అదనంగా, రిజ్టాలో స్కిడ్‌కంట్రోల్™ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఫాల్‌సేఫ్™, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS), థెఫ్ట్ మరియు టో డిటెక్ట్ మరియు పింగ్ మై స్కూటర్ వంటి ఏథర్ 450 సిరీస్ స్కూటర్‌లలో గతంలో అందుబాటులో ఉన్న ఫీచర్లు వీటిలోనూ ఉన్నాయి.

- Advertisement -

ఏథర్ ఎనర్జీ కూడా రైడర్‌లకు అడ్డంకులు, అవాంతరాలు లేని అనుభవాన్ని అందించేందుకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పలు చోట్ల ఏర్పాటుకు కట్టుబడి ఉంది. ఏథర్ గ్రిడ్ అని పిలువబడే ద్విచక్ర వాహనాల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 1900 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లకు అందుబాటును అందిస్తుంది. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను కలిగి ఉంది. ఇక్కడ వినియోగదారులు ఏథర్ స్కూటర్‌లను టెస్ట్ రైడ్ చేయడంతో పాటు కొనుగోలు చేసుకోవచ్చు. తమిళనాడులోని హోసూర్‌లో ఏథర్‌కు 2 తయారీ పరిశ్రమలు ఉన్నాయి. వాహనాల అసెంబ్లింగ్ మరియు బ్యాటరీ తయారీకి మూడవ కేంద్రంగా మహారాష్ట్రలోని బిడ్కిన్, AURIC, ఛత్రపతి శంభాజీ నగర్‌లో సిద్ధం అవుతోంది.

2.9 kWh కలిగిన ఏథర్ రిట్జా S ధర రూ.1,09,841 (ఎక్స్-షోరూమ్ విశాఖపట్నం). ఏథర్ రిట్జా Z 2.9 kWh మరియు రిట్జా Z 3.7 kWh రూ.1,24,841 మరియు రూ.1,44,842 (ఎక్స్-షోరూమ్ విశాఖపట్నం) ధరల్లో లభిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement