హైదరాబాద్, (ప్రభ న్యూస్) : హైదరాబాద్‌లోని ప్రముఖ ఆటోమోటివ్ ఆప్టర్ మార్కెట్ విడి భాగాల సరఫరాదారు, ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన అడ్వాన్స్ ఆటో పార్ట్స్ యొక్క గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, హైదరాబాద్‌తో (ఐఎంటి హైదరాబాద్) ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఆర్థిక శాఖలో గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగానికి సిద్ధంగా ఉండే శ్రామికశక్తిని ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించే వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం, తద్వారా హైదరాబాద్‌లో అన్ని అవసరాలకు కావలసిన ఉద్యోగులు అందుబాటులో ఉండేలా ఒక వ్యూహాన్ని అమలుపరుస్తుంది.
అడ్వాన్స్ ఆటో పార్ట్స్ ఇండియా జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ దుబ్బా మాట్లాడుతూ, డిజిటలై జషన్ కారణంగా రిటైల్ ఆటోమోటివ్ ఆప్టర్ మార్కెట్ పరిశ్రమ అతి వేగంగా మార్పు చెందుతోందని, ఈ వేగం వల్ల వచ్చే ఆటు పోట్లను అధిగమించిడానికి సరైన ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ మరియు వ్యాపార నమూనాలు పునర్నిర్మించబడు తున్నాయని అన్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ టెక్నాలజీ హైదరా బాద్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీహర్ష రెడ్డి మాట్లాడుతూ, ఫా ర్చ్యూన్ 500 కంపెనీ అయినటువంటి అడ్వాన్స్ ఆటో పార్ట్‌తో కలవడానికి సంతోషిస్తున్నామని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.