ఉజ్వల పథకం కింద పేదలకు ఇచ్చే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం కేంద్రం అదనపు నిధుల వినియోగానికి పార్లమెంట్ అనుమతి కోరనుంది. డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అదనపు గ్రాంట్స్ కోసం పార్లమెంట్ ఆమోదం
తీసుకోనుంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉజ్వల వినియోగదారులకు ఒక్కో సిలిండర్‌పై 300 రూపాయల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది.
దీంతో పాటు ఈ పథకం కింద మరిన్ని కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సమారు 9 వేల కోట్ల వ్యయానికి పార్లమెంట్ అనుమతి క ఓరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ఇచ్చే బడ్జెట్‌లో ఎల్పీజీ సబ్సిడీ కోసం కేటాయింపులు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో సబ్సిడీ కోసం కేటాయించిన మొత్తం కంటే కనీసం 40 నుంచి 50 శాతం వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనరల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సబ్సిడీని మరింత పెంచాలని కేంద్రం భావిస్తోంది. గ్యాస్ భారం నుంచి ఊరట కల్పించే ఉద్దేశంతో ఈ ఏడాది ఆగస్టులో గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయలు తగ్గిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.
దీని వల్ల 33 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. ధర తగ్గించాక దేశ రాజధాని ఢిల్లిdలో ఎల్పీజీ సిలిండర్ ధర 903 రూపాయలకు తగ్గింది. అదే ఉజ్వల యోజన పథకం వినియోగదారులకు సబ్సిడీ అనంతరం 603 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నారు. సబ్సిడీ కొనసాగించడంతో పాటు కొత్తగా మరో 75 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.