Saturday, November 23, 2024

పెట్టుబడుల కోసం అదానీ చర్చలు.. 10 బిలియన్‌ డాలర్ల సమీకరణ లక్ష్యం

భారతదేశ దిగ్గజ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతం అదానీ మరిన్ని పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలతో చర్చలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా సింగపూర్‌ పెట్టుబడి సంస్థలైన టెమాసెక్‌, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీతో సహా ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపు కుటుంబ సభ్యులు, టాప్‌ గ్రూపు పలువురు ఎగ్జిక్యూటివ్‌లు ఈ పెట్టుబడిదారులతో చర్చలు జరినట్లు సమాచారం.

ఓడరేవులు, విమానాశ్రయాలు, గ్రీన్‌ ఎనర్జీ, సిమెంట్‌, డాటా సెంటర్లు తదితర వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూపు రాబోయే పదేళ్లలో 100 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో అధికభాగం ఎనర్జీ, డాటా సెంటర్ల వంటి డిజిటల్‌ విభాగంలో పెట్టుబడులు ఉంటాయని అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement