Friday, November 22, 2024

అద‌ర‌హో… అదానీ..

ఈ ఏడాది ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంపాదన
2021లో ఇప్పటివరకు 16.2 బిలియన్‌ డాలర్లు ఆర్జన
ప్రపంచ కుబేరులు జెఫ్‌ బెజోస్‌, ఎలాన్‌ మస్క్‌ కంటే అధికం
బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్

ముంబై : భారతీయ అగ్ర సంపన్ను ల్లో ఒకరైన గౌతమ్‌ అదానీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది 2021లో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంపద ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు. 2021లో ఇప్పటివరకు గౌతమ్‌ అదానీ సంపద ఏకంగా 16.2 బిలియన్‌ డాలర్ల మేర వృద్ధి చెంది మొత్తం 50 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల సూచీ పేర్కొంది. అదానీకి చెందిన పోర్టుల నుంచి పవర్‌ ప్లాంట్ల వ్యాపారాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపు తుండడంతో ఆయన కంపెనీలకు చెందిన షేర్ల విలువ అమాంతం పెరిగిపోతుండడం ఆయన కలిసొస్తోంది. దీంతో ఈ ఏడాది ప్రపంచం లో అందరికంటే ఎక్కువగా సంపాదించిన వ్యక్తిగా నిలిచారు. ప్రపంచ కుబేరుడి స్థానం కోసం పోటీపడుతున్న అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ల కంటే అదానీ ఎక్కువగా సంపాదించారని రిపోర్టు పేర్కొంది. అదానీ గ్రూపునకు చెందిన కంపెనీల స్టాకుల్లో ఈ ఏడాది ఒకటి మినహా మిగతావన్నీ 50 శాతానికి పైగా వృద్ధి చెందాయి. కాగా భారత్‌కే చెందిన ఆసియా కుబేరుడు ముకేష్‌ అంబానీ సంపద ఈ ఏడాది ఇప్పటివరకు 8.1 బిలియన్‌ డాలర్ల మేర పెరిగింది.
వేగంగా సామ్రాజ్య విస్త‌ర‌ణ‌
బహిరంగ ప్రదేశాల్లో చాలా అరుదుగా మాట్లాడే.. గౌతమ్‌ అదానీ భారత్‌లో చాలా వేగంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటు న్నారు. భారత్‌లో పోర్టులు, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లు, బొగ్గు గనుల సంఖ్యను పెంచుకుంటు న్నారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో వివాదాస్పద కర్మికేల్‌ బొగ్గు ప్రాజెక్టుకు ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. మార్కెట్‌ చక్రీయ ప్రక్రియల్లో అత్యం త కీలకమైన వ్యాపారాలను గౌతమ్‌ అదానీ స్థిరంగా పెంచుకుంటున్నారని నైకా అడ్వైజరీ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ చండిరమణి అన్నారు. ప్రస్తుతం డేటా సెంటర్ల బిజినెస్‌లో అడుగుపెట్టడంతో టెక్నాలజీ రంగంలో కూడా అడుగుపెట్టబోతున్నామని సిద్ధంగా ఉన్నామ ని కంపెనీ సంకేతాలిచ్చినట్ట యిందని ఆయన పేర్కొ న్నారు. కాగా భారత్‌లో 1 గిగావాట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు గత నెల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
కొన్ని కంపెనీల షేర్లు 90శాతం కంటే ఎక్కువ‌
అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ షేర్లు ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా 96 శాతం వృద్ధి చెందా యి. ఆ తర్వాత అదానీకి అత్యంత కీలకమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 90 శాతం లాభపడింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ 79 శాతం, అదానీ పోర్ట్స్‌ అం డ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ లిమిటెడ్‌ 52 శాతాని కిపై గా బలపడింది. కాగా గతేడాది ఏకంగా 500 శాతం కంటే ఎక్కువ బలపడిన అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు ఈ ఏడాది ఇప్పటివరకు 12 శాతం వృద్ధి చెందాయి.
అదానీ కంపెనీల నిక‌ర సంప‌త‌
అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ 18 బిలియన్‌ డాలర్లు
అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌ 9 బిలియన్‌ డాలర్లు
అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ 8 బిలియన్‌ డాలర్లు
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 8 బిలియన్‌ డాలర్లు
అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ 6 బిలియన్‌ డాలర్లు
అదానీ పవర్‌ లిమిటెడ్‌ 2 బిలియన్‌ డాలర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement