Tuesday, November 26, 2024

డీబీ పవర్‌ను కొనుగోలు చేసిన ఆదానీ

అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. విలీనాలు, వాటాల కొనుగోలుతో అనేక కంపెనీలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా అదానీ గర్‌ప్‌ మరో కొనుగోలు చేసింది. ఇంధన రంగంలో ఉన్న డీబీ పవర్‌ను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింఇ. ఈ డీల్‌ విలువ 7,07 కోట్లుగా ఉందని కంపెనీ బీఎస్‌సీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు తెలిపింది. చత్తీస్‌గఢ్‌లోని జంజ్గిర్‌ చంపా జిల్లాలో డీబీ పవర్‌ 600 మెగావాట్ల రెండు యూనిట్లుతో ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ కలిగి ఉంది. 923.5 మెగావాట్ల విద్యుత్‌

కొనుగోలు ఒప్పందాలు కంపెనీ చేతిలో ఉన్నాయి. కంపెనీలో అదానీ గ్రూప్‌ వంద శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌ 31 నాటికి కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేయాలని రెండు కంపెనీలు నిర్ణయించాయి. ఈ కంపెనీని కొనుగోలు చేయడంతో అదానీ పరిధి విద్యుత్‌ రంగంలో మరింత పెరగనుంది.

ఓపెన్‌ ఆఫర్‌కు ఓకే..

అంబుజా, ఏసీసీ సిమెంట్‌ కంపెనీల్లో వాటాల కొనుగోళ్ల విషయంలో అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌కు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండు కంపెనీల్లో ఉన్న హోలిమ్స్‌కు చెందిన వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. హోలిమ్స్‌కు అంబుజా సిమెంట్స్‌లో 63.11 శాతం వాటా ఉంది. ఏసీసీ సిమెంట్స్‌లో 4.48 శాతం వాటా ఉంది. ఓపెన్‌ ఆఫర్‌కు సెబీ అంగీకారం తెలినందున అంబుజా సిమెంట్స్‌ షేరుకు 385 రూపాయలు, ఏసీసీ షేరుకు2,300 రూపాయలు చొప్పున అదానీ గ్రూప్‌ చెల్లించనుంది. ఇందు కోసం 31,139 కోట్లు వెచ్చించనుంది. ఇదే రేటుతతో పబ్లిక్‌ నుంచి 26 శాతం వాటా షేర్లను కూడా కొనుగోలు చేయనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement