పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు బయోగ్యాస్‌లో పోటీ పడుతున్నారు. అదానీకి చెందిన అదానీ న్యూ ఇండస్ట్రీస్(ఏఎన్‌ఐఎల్), రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు సంస్థలు బయోగ్యాస్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. రెండు కంపెనీలు రెండు చోట్ల కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి.
అదానీ కంపెనీ 40 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ కూడా రెండు ప్లాం ట్లు పెడుతున్నట్లు ప్రకటించిన ప్పటికీ, వాటిని ఎక్కడ ఏర్పాటు చేసేది వెల్లడించలేదు.
ఈ రెండు కంపెనీలు బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు 500-600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించాయి. ఈ ఇద్దరు దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెట్టనున్న బయోగ్యాస్ ఉత్పత్తికి వ్యవసాయ వ్యర్ధాలు, చెరకు పిప్పి, మున్సిపల్ వేస్ట్‌ను ఉపయోగించనున్నారు. రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా బయోగ్యాస్‌ను సరఫరా చేయనున్నారు.