గ్లోబల్ ఇన్వెస్టర్ అయిన యాక్టిస్.. ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్‌ను కొనుగోలు చేసింది. ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ అనే సంస్థ, భారతదేశంలోని లైఫ్ సెన్సెస్, సంబంధిత రంగాల్లోని కంపెనీలకు రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ (ఆర్అండ్డీ ల్యాబ్‌లు, అనుబంధ సౌకర్యాలు) సేవలు అందిస్తు ఉంటుంది. ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ లైఫ్ సైన్సెస్.. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో లైఫ్ సైన్సెస్ సెక్టార్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. డిజైన్, అభివృద్ధి దశలో 3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధి, మార్కెటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా యాక్టిస్ పార్టనర్, గ్లోబల్ హెడ్ బ్రియాన్ చినప్పి.. మాట్లాడుతూ.. ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్లోని బృందం.. భారతదేశంలో లైఫ్ సైన్సెస్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంలో, ప్రచారం చేయడంలో ఒక దశాబ్దానికి పైగా అనుభవం కలిగి ఉందన్నారు. డీప్ డిజైన్, డెవలప్మెంట్, కస్టమైజేషన్, మార్కెటింగ్ నైపుణ్యం ద్వారా టీమ్ లైఫ్ సైన్సెస్ సెక్టార్‌లోని అద్దెదారులకు రియల్ ఎస్టేట్ సొల్యూషన్లను విజయవంతంగా అందిస్తోందన్నారు.
వృద్ధికి భారీ సామర్థ్యం..
భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగం ప్రస్తుత దశాబ్దంలో వృద్ధికి భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. గణనీయమైన పోటీ వ్యయంతో పెద్ద టాలెంట్ పూల్తో ఇది ప్రపంచ ఆర్అండ్డీ, తయారీకి కచ్చితమైన గమ్య స్థానంగా మారిందని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ , బ్రౌన్ ఫీల్డ్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని కొనుగోలు, బిల్ ్డ ప్రోగ్రామ్స్‌లో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్.. హైదరాబాద్, బెంగళూరు, ముంబైలలో అభివృద్ధి చెందుతున్న లైఫ్ సైన్సెస్ క్లస్టర్లపై దృష్టి సారిస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. భారత్‌లో లైఫ్ సైన్సెస్ రంగం ఇప్పటికే ప్రపంచ వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. ఇది స్థానిక, గ్లోబల్ పరంగా గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉందని వివరించారు.
యాక్టిస్ నిధుల సేకరణ..
యాక్టిస్ పార్టనర్, ఇండియా హెడ్ ఆశీష్ సింగ్ మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్ కార్పొరేషన్లకు ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయన్నారు. తరుచూ సప్లైలో లోపం ఉన్న కారణంగా.. రియల్ ఎస్టేట్ పరిష్కారాలు అవసరమని తెలిపారు. ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ మేనేజ్మెంట్ బృందం.. ఒక దశాబ్ద కాలం పాటు డొమైన్ అనుభవంతో.. ఈ ఖాళీని పూరించడానికి చూస్తోందన్నారు. రియల్ ఎస్టేట్ పరిష్కారాలు అందించడంతో.. భారత్ బౌండ్ డ్రగ్ డిస్కవరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్‌లకు మద్దతు ఇస్తుందన్నారు. యాక్టిస్ ఇటీవల ఆసియా రియల్ ఎస్టేట్ ఫండ్ 2 కోసం నిధుల సమీకరణ పూర్తి చేసుకుంది. 700 మిలియన్ డాలర్ల మొత్తం ఎల్పీ ఫండ్, సహ కో-ఇన్వెస్ట్‌మెంట్‌ను సూచిస్తుంది. భారతదేశం, ఆగ్నేయాసియా, వియత్నాంలోని యాక్టిస్.. కీలకమైన భౌగోళిక ప్రాంతాలపై దృష్టి సారించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..