Saturday, November 23, 2024

సేవలరంగంలో అభివృద్ధి వేగవంతం

ద్రవ్యోల్బణం ఉరుముతున్నప్పటికీ భారతీయ సేవలరంగం అభివృద్ధి దిశగా ఉరకలు వేస్తోంది. ప్రత్యేకించి అక్టోబర్‌లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని సేవల రంగం ప్రగతిపథంలో దూసుకుపోయింది. భారత ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రెండో స్థానంలో సేవల రంగం నిలిచిందని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆ సంస్థ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం సెప్టెంబర్‌లో 54.3 శాతం వృద్ధిరేటు ఉండగా అక్టోబర్‌కు 55.1 శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌లో ఆరునెలల కనిష్టానికి వృద్ధి రేటు చేరుకోగా అక్టోబర్‌లో సేవలరంగం పుంజుకుంది. ఆహారం, ఇంధనం, చిల్లర ధరలు బాగా పెరగడంతో వినియోగదారుల ఖర్చులు బాగా పెరిగాయి, ఫలితంగా సేవల రంగంలో లావాదేవీలు విస్తృతమైనాయని ఆ సంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement