Saturday, November 23, 2024

ఏబీజీ షిప్‌యార్డ్ భారీ బ్యాంక్‌ స్కాం.. ఎకంగా 28 బ్యాంకులకు కుచ్చుటోపి..

గుజరాత్‌లో భారీ బ్యాంక్‌ స్కాం బయటపడింది. ఈ మోసం విలువ అక్షరాలా రూ.22,842 కోట్లు. ఏబీజీ షిప్‌యార్డ్‌ అనే కంపెనీ ఈ ఘనకార్యానికి పాల్పడింది. 28 బ్యాంకులను ముంచేసింది. ఉద్దేశపూర్వకంగా మోసగించిన ఈ కంపెనీ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డు, డైరెక్టర్లు రిషి అగర్వాల్‌, సంతానం ముత్తుస్వామితో పాటు అశ్వినీ కుమార్‌లపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) శనివారం కేసు నమోదు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుంది. గుజరాత్‌లోని దహేజ్‌, సూరత్‌లలో ఈ సంస్థకు షిప్‌యార్డులు ఉన్నాయి. ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఏబీజీ గ్రూప్‌కి చెందిన కంపెనీ. ఇది షిప్‌ బిల్డింగ్‌, షిప్‌ రిపేర్‌లకు సంబంధించిన కార్యకలాపాలను చూసుకుంటుంది. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో కంపెనీ డైరెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వివిధ బ్యాంకులు ఫిర్యాదు చేశాయి.

ఐసీఐసీఐ బ్యాంకుకు అత్యధికం..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకి రూ.1,614 కోట్లు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.2,925 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.7,089 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.3,634 కోట్లు ఏబీజీ షిప్‌యార్డ్‌ బకాయి చెల్లించాల్సి ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.1,244 కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుకు రూ.1,228 కోట్లు బకాయి ఉంది. ఏప్రిల్‌ 2012 నుంచి జులై 2017 వరకు జనవరి 18, 2019 నాటి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక, నిందితులు కుమ్మక్కయ్యారని, నిధులు మళ్లించారని, దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. కంపెనీ మొత్తం రూ.22,842 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉందని తెలిపాయి. నేరపూరిత విశ్వాస ఉల్లంఘన వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని వెల్లడించింది.

కరోనా ప్రభావమే కారణం..!

కమోడిటీ డిమాండ్‌, ధరలు తగ్గడం, కార్గో డిమాండ్‌ పడిపోవడంతో ప్రపంచ సంక్షోభం షిప్పింగ్‌ పరిశ్రమపై ప్రభావం చూపింది. కొన్ని ఓడలు, ఓడల కోసం ఒప్పందాలను రద్దు చేయడంతో ఇన్వెంటరీ పేరుకుపోయిందని పేర్కొంది. దీని ఫలితంగా వర్కింగ్‌ క్యాపిటల్‌ కొరత ఏర్పడిందని సీబీఐ విచారణలో తేలింది. ఆపరేటింగ్‌ సైకిల్‌లో గణనీయమైన పెరుగుదలకు కారణమైంది. దీంతో లిక్విడిటీ సమస్యతో పాటు ఆర్థిక సమస్య మరింత తీవ్రమైంది. 2015 నుంచి పరిశ్రమ నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నది. వాణిజ్య నౌకలకు డిమాండ్‌ లేకపోవడంతో భారీగా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో కంపెనీలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా గడువు తేదీలో కంపెనీ వడ్డీ, వాయిదాలను చెల్లించలేకపోయింది. ఏబీజీ షిప్పింగ్‌ లిమిటెడ్‌ ఇప్పటి వరకు 165కు పైగా నౌకలను నిర్మించిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది.

- Advertisement -

కంపెనీ నిధుల మళ్లింపు..

ఈ మేరకు కంపెనీ డైరెక్టర్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారిని విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. బ్యాంకు నిధులను విడుదల చేసే ప్రయోజనాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించారని సీబీఐ తన విచారణలో భాగంగా తేల్చింది. ఈ విషయాన్ని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చింది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక ఏప్రిల్‌ 2012, జులై 2017 మధ్య మోసం జరిగినట్టు చూపిస్తుంది. బ్యాంకు నిధుల ఖర్చుతో చట్టవిరుద్ధంగా పొందే లక్ష్యంతో నిధుల మళ్లింపు, దుర్వినియోగం, నేరపూరిత నమ్మకాన్ని ఉల్లంఘించడం ద్వారా మోసం జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఎలన్‌ మస్క్‌.. ఆలోచించుకో..! ఇదే ఆఖరి ఛాన్స్.. స్థానికంగా ఏర్పాటు చేస్తేనే రాయితీలు

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అడుగుపెట్టేందుకు నిర్ణయించడం శుభపరిణామమే అయినా.. ఆ కంపెనీ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే టెస్లా విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. తాజాగా రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ టెస్లాకు ఆఖరి ఛాన్స్‌ ఇచ్చారు. భారత్‌లో తయారీ యూనిట్‌లు పెడితే.. రాయితీలు, ప్రోత్సాహకాలు గురించి ఆలోచిస్తామన్నారు. భారత్‌లో యూనిట్‌ పెట్టి.. చైనాతో కార్లు తయారు చేయిస్తాం అంటూ అస్సలు వినేది లేదన్నారు. చైనాలో తయారు చేసి.. భారత్‌లో అమ్ముతామంటే కూడా కుదరదని తేల్చి చెప్పారు. అసలు టెస్లా తీసుకొచ్చిన ప్రతిపాదన అస్సలు నచ్చడమే లేదన్నారు.

కొత్త రాయితీల్లేవు..

వాహన రంగ కంపెనీలకు భారత్‌ మంచి మార్కెట్‌ అందిస్తోందని, బీఎండబ్ల్యూ, వోలో, ఫోక్స్‌ వ్యాగన్‌, హ్యుందాయ్‌, హోండా, రెనాల్ట్‌ లాంటి ఎన్నో కంపెనీలు ఇక్కడ ఉన్నాయని గుర్తు చేశారు. ఆ కంపెనీలకు ఎలాంటి రాయితీలు ఇస్తున్నామో.. టెస్లాకు కూడా అదే ఇస్తామని తేల్చి చెప్పారు. టెస్లాకు ప్రత్యేక రాయితీలు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు. టెస్లాకు కొత్త రాయితీలు ఇస్తే.. పాత కంపెనీలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. చైనాలో ప్లాంట్లు పెట్టి.. అక్కడి వారికి ఉద్యోగాలు ఇచ్చి.. ఇండియాలో కార్లు అమ్ముకుని లాభాలు పొందుతామనడం ఆశ్చర్యం వేస్తోందన్నారు. భారత్‌లో టెస్లా కార్లు అమ్ముకునేందుకు.. బెంగళూరులో కంపెనీ ఆఫీస్‌ రిజిస్టర్‌ చేసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనం కావడంతో ప్రత్యేక రాయితీలు ఇవాలని టెస్లా డిమాండ్‌ చేస్తున్నది. భారత్‌లోనే ఉత్పత్తి చేస్తే రాయితీలని, దిగుమతి చేస్తామంటే అదే స్థాయిలో పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందని భారత్‌ హెచ్చరిస్తున్నది. ఇవన్నీ చెప్పుకోని ఎలన్‌ మస్క్‌.. ప్రభుత్వం సహకరించడం లేదంటూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement