Friday, November 22, 2024

UIDAI | ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌.. గడువు మరోసారి పొడిగింపు

ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పెంచింది. అంతకు ముందు పొడిగించిన గడువు సెప్టెంబర్‌ 14తో ముగిసింది. దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ-ఉడాయ్‌) ఈ నిర్ణయం తీసుకుంది. ఉచిత అప్‌డేట్‌ గడువు పెంచుతున్నట్లు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఈ గడువును 2024 డిసెంబర్‌ 14 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఆధార్‌ కార్డును ఇంకా అప్‌డేట్‌ చేసుకోని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉడాయ్‌ కోరింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) నిబంధనల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి.

ఉచిత సేవలు మై ఆధార్‌ పోర్టల్‌ ద్వారా మాత్రమే పొందే వీలుంది. ఆధార్‌లో చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిని ఈ సందర్భంగా సవరించుకోవచ్చు. గడువు ముగిసిన తరువాత ఆధార్‌ కేంద్రాల్లో 50 రూపాయల ఫీజ్‌ చెల్లించి అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని భావించే వారు ఆన్‌లైన్‌లో యూఐడీఏఐ వెబ్‌సౖౖెట్‌లో ఆధార్‌ నెంబర్‌తో లాగిన్‌ అయి సరి చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement