Friday, November 22, 2024

మ‌రింత బ‌ల‌ప‌డ్డ‌ భారత్‌, ఆసియాలో ఆర్థిక శక్తిగా ఇండియా

ఆసియాలోనే బలమైన ఆర్థిక శక్తిగా భారత్‌ అవతరించనుందని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌ ఆర్థికంగా అజేయశక్తిగా ఎదుగుతుందని ఈ సంస్థకు చెందిన ఆర్ధికవేత్తలు చెప్పారు.

భారత్‌ సరాసరి వృద్ధిరేటు 2022-2023లో 7శాతం ఉంటుందని , ఆసియా అభివృద్ధిలో 28 శాతం, ప్రపంచ అభివృద్ధిలో 22 శాతం వాటా కలిగి ఉంటుందని వీరు అంచనా వేశారు. మోర్గాన్‌ స్టాన్లీ అర్ధికవేత్తల అంచనా ప్రకారం 2022లో మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 9.2 శాతం వరకు ఉంటుందని తెలిపారు. కోవిడ్‌ మూలంగా గత సంవత్సరం ఇది 6.6 శాతం ఉన్నప్పటికీ, అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుందని విశ్లేషించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 8-8.5 శాతం వరకు ఉంటుందని వీరు స్పష్టం చేశారు.

ప్రధానంగా కార్పోరేట్‌ పన్నులు తక్కువగా ఉండటం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందించే స్కీమ్‌, సరఫరాల్లో విభిన్నత ఉండటం వంటి అనేక కారణాల వల్ల భారత్‌ ఆర్ధిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనబరుస్తుందని వారు తెలిపారు.

కోవిడ్‌ మూలంగా దెబ్బతిన్న పరిశ్రామిక రంగం కోలుకునేందుకు వీలుగా ప్రభుత్వం కార్పోరేట్‌ పన్నులను తగ్గించింది. దేశీయంగా ఉత్పత్తి పెంచేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల పథకం (పీఎల్‌ఐ) స్కీమ్‌ వల్ల ఈ రంగం ఎంతో ప్రయోజకం కలిగిందని వీరు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం మూలంగా తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దేందుకు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిందని కొనియాడారు. కార్పోరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు బలంగా ఉంటం బిజినెస్‌ కాన్ఫిడెన్స్‌ను పెంచిందని పేర్కొంది. ఇది దేశంలో పెట్టుబడులు పెట్టే దృక్పదాన్ని పూర్తిగా మార్చిందని అభిప్రాయపడ్డారు. 529.7 బిలియన్‌ డాలర్ల భారత బడ్జెట్‌ వల్ల ప్రభుత్వ పెట్టుబడులు పెరిగేందుకు ఉపయోగపడిందని తెలిపారు. వస్తు సామాగ్రిని ఎగుమతి చేసేందుకు బడులు సర్వీసెస్‌ను ఎగుమతి చేయడం మేలు చేస్తుందని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. దేశీయంగా వినియోగాన్ని పెంచడం ముఖ్యమని అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement