Monday, November 18, 2024

Ghost jobs | నియామకాల్లో కొత్త ట్రెండ్‌

ప్రపంచ వ్యాప్తంగా జాబ్‌ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ పుట్టుకొచ్చింది. దీనిపేరు ఘోస్ట్‌ జాబ్స్‌. ఉద్యోగ ఖాళీలు లేకున్నప్పటికీ, నియామకాల కోసం ప్రకటలు జారీచేయడం, దరఖాస్తులు స్వీకరించడం, పరీక్షల నుంచి ఇంటర్వూల దాకా అన్ని ప్రక్రియల్ని సీరియస్‌గా నిర్వహించడం ఆ తర్వాత దాన్ని అటకెక్కించడాన్ని ఘోస్ట్‌ జాబ్స్‌ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ తరహా ట్రెండ్‌ కొనసాగుతున్నది.

కంపెనీలకు చెలగాటంలా ఉన్నా నిరుద్యోగులకు మాత్రం ఇది ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ పరిణామం గురించి మౌరీన్‌ డబ్ల్యు క్లాఫ్‌ అనే మహిళ సామాజిక మాధ్యమం యాప్‌ థ్రెడ్‌లో ఈ తరహా జాబ్స్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను పనిచేసే కంపెనీలోని హెచ్‌ఆర్‌ సిబ్బంది ఇలాంటి జాబ్‌ల కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని తనను కోరినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

అయితే ఒక రకంగా మోసపూరితంగా కనిపించే ఈ విధానానికి తాను ఒప్పుకోలేదని ఆమె వెల్లడించారు. అయితే, కంపెనీలు ఈ ఉత్తుత్తి నియామక ప్రక్రియను ఎందుకు చేపడతాయనే దానిపై నిపుణులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. ప్రధానంగా వినిపిస్తున్నదేమిటంటే, ఇలాంటి ఓపెనింగ్స్‌తో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా, జాబ్‌ మార్కెట్‌ స్థితిగతులు, అభ్యర్థుల టాలెంట్‌ స్థాయిలు, భవిష్యత్‌ అవసరాలకు గల వాతావరణం వంటి వాటిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికే చాలా కంపెనీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement