Tuesday, November 19, 2024

Ather 450 | ఎథర్‌ నుంచి కొత్త స్కూటర్‌…

ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ నుంచి మరో కొత్త స్కూటర్‌ విడుదలైంది. ఎప్పటి నుంచో టీజర్లతో ఊరిస్తూ వస్తున్న ఏథర్‌ 450 అపెక్స్‌ పేరుతో కొత్త ఈవీ స్కూటర్‌ను శనివారం నాడు లాంచ్‌ చేసింది. దీని ధర 1.89 లక్షలు ఎక్స్‌షోరూమ్‌ ధరగా కంపెనీ నిర్ణయించింది. ఏథర్‌ ప్రస్తుతం 450 ఎస్‌, 450 ఎక్స్‌ పేరిట రెండు మోడళ్లను విక్రయిస్తోంది. వాటితో పోలిస్తే కొత్త స్కూటర్‌లో అదనంగా 3.7 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీని ఇచ్చారు.

ఏథర్‌ అపెక్స్‌ ఒక సింగిల్‌ ఛార్జితో 157 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తోంది. ఇందులో మొత్తం ఐదు రైడింగ్‌ మోడ్‌లు ఇచ్చారు. వ్రాప్‌ మోడ్‌ స్థానంలో కొత్తగా వ్రాప్‌ ప్లస్‌ను పరిచయం చేశారు. అలాగే మ్యాజిక్‌ ట్విస్ట్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. సాధారణంగా బ్రేక్‌ వేసినప్పుడు థ్రోటల్‌ రిలేజ్‌ చేస్తూ, బ్రేక్‌ అప్లయ్‌ చేస్తుంటారు. ఈ కొత్త ఫీచర్‌లో థ్రోటల్‌ రిలీజ్‌ చేసిన ప్రతిసారీ బ్రేక్‌ వేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా బ్రేక్‌ అప్లయ్‌ అవుతుంది.

ఈ స్కూటర్‌ 2.09 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఏథర్‌ 450 అపెక్స్‌ను ఇడియమ్‌ బ్లూ రంగులో తీసుకొచ్చారు. ఇది ఐదేళ్లు లేదా 60 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తోంది. ఈ కొత్త స్కూటర్‌ బుకింగ్స్‌ గత నెల నుంచి ప్రారంభమయ్యాయి. 2,500 రూపాయలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. మార్చి నెల నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement