Wednesday, January 8, 2025

Kritika Infra | భారీ కుంభకోణం.. గేటెడ్ కమ్యూనిటీ పేరుతో రూ.100 కోట్ల స్కాం !

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : నగరంలో ప్రీ లాంఛ్‌ మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రీ లాంఛ్‌ ఆఫర్‌ పేరుతో క్రితికా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ దాదాపు రూ. 100 కోట్ల మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రీ లాంఛ్‌ ఆఫర్ల పేరుతో క్రితికా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ వందలాది మంది నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు కట్టించుకోని సంవత్సరాలు దాటినా ఫ్లాట్స్‌ను ఇవ్వడంలేదంటూ కస్టమర్లు వాపోతున్నారు.

వివరాల్లోకి వెళితే….క్రితికా ఇన్‌ఫ్రా నిర్వాహకులు ఎల్బీ నగర్‌ కేంద్రంగా 2020లో ప్రీ లాంఛ్‌ పేరుతో సేల్స్‌ చేసి కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. క్రితికా ఇన్‌ఫ్రా ఎండి రాధా భూక్యా డైరెక్టర్‌ ధూమవాత్‌ గోపాల్‌, సీఈవో శ్రీకాంత్‌లు ఏజెంట్లను నియమించి ఫ్రీలాంచ్‌ పేరిట వసూళ్లకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌ శివార్లలోని తట్టి అన్నారంలో 2 ఎకరాల్లో శేషాద్రి ఓక్‌ పేరుతో ఎస్‌ ప్లస్‌ 6 అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తామని నమ్మబలికారు. అలాగే ఉప్పల్‌లో 3 ఎకరాల్లో శేషాద్రి సిల్వర్‌ ఓక్‌ పేరుతో గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తామని పెద్ద ఎత్తున వసూళ్లు చేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో 150 మంది కస్టమర్ల నుంచి ప్రీ లాంఛ్‌ పేరుతో రూ. 100 కోట్ల మేరకు వసూలు చేసినట్లు బాధితులు వివరిస్తున్నారు. ఫ్రీలాంచ్‌ పేరిట వసూలు చేసిన మొత్తాలను క్రితికా ఇన్‌ ఫ్రా నిర్వహకులు ఇతర వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

క్రితికా ఇన్‌ ఫ్రా యజమాని, డైరెక్టర్‌, సీఈవోలను తాజాగా బాదితులను బెదిరిస్తుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement