కొద్దిరోజులుగా కోలుకున్న రూపాయి మళ్లి నేలచూపులు చూసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 42 పైసలు తగ్గి రూ.79.66గా కనిష్ఠస్థాయికి పతనమైంది. శుక్రవారం లావాదేవీలు ముగిసేసమయానికి 79.6550గా ఉండగా శనివారం మరింత పతనమైంది. అమెరికాలో ఉద్యోగాల కల్పనలో సానుకూల పరిణామాలు, సెప్టెంబర్‌లో 75 బేసిస్ పాయింట్లను ఫెడ్ పెంచుతుందన్న అంచనాలతో డాలర్ బలపడగా రూపాయి చిక్కిపోయింది.
అయితే దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై కన్పించలేదు. సూచీలు రెండూ లాభాల బాటలో పయనించాయి. మూలధ పెట్టుబడులు పెరగ్గా ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లు సానుకూల ఫలితాలు సాధించాయి.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.