ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ 9,925 కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకించింది. ప్రధానంగా వేగనార్, సెలెరియా, ఇగ్నిస్ చెందిన మోడళ్లో కొన్ని కార్లను కంపెనీ వెనక్కి పిలిపిస్తోంది. వెనుక బ్రేక్ అసెంబ్లి పిన్‌లో లోపం ఉండే అకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్1 మధ్య తయారైన కార్లోల లోపం ఉండే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. బ్రోల్ అసెంబ్లి పిన్ విరిగిపోయి శబ్దం రావచ్చని గుర్తించినట్లు తెలిపింఇ. దీర్ఘకాలంలో ఇది బ్రేక్ పనితీరుపై ప్రభావం చూపుతుంది.
అందుకే కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని లోపాలు ఉండే అవకాశం ఉన్న కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. లోపం ఉన్నట్లు గుర్తిస్తతే ఊచితంగానే సరి చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే అందుకు కావాల్సిన పరికరాలను వర్క్‌షాప్‌లకు పంపించినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. కంపెనీ పేర్కొన్న తేదీల్లో తయారైన కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లను కంపెనీ ప్రతినిధులు త్వరలోనే సంప్రదిస్తారని పేర్కొంది.