Thursday, September 19, 2024

HYD: గతేడాది గ్రాసియాను ఉపయోగించిన 98శాతం మిరప రైతులు – గోద్రెజ్ ఆగ్రోవెట్

హైదరాబాద్ : మిరప పంటల కోసం 98శాతం మిరప రైతులు గ్రాసియాను ఉపయోగించారని, ఇది మిరప పంటలకు సమర్థవంతమైన చీడ పీడల నివారిణి అని గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ (జీఏవీఎల్) వెల్లడించింది. దక్షిణాదిలోని మిరప మార్కెట్‌లలో నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేస్తూ, 57శాతం మంది రైతులు 15-35 రోజులు మధ్య గ్రాసియాను ఉపయోగించారని కంపెనీ వెల్లడించింది.

ఈసంద‌ర్భంగా గోద్రెజ్ ఆగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సీఈఓ రాజవేలు ఎన్.కె మాట్లాడుతూ… మిరప పంటలో 15-25 రోజుల దశలో గ్రాసియాను పిచికారీ చేస్తే తామర పురుగు (త్రిప్స్‌) నుంచి దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుందన్నారు. రైతులు గ్రాసియాను ముందుగానే ఉపయోగించడంలో విలువను కనుగొంటున్నట్లు పరిశోధనలు స్పష్టంగా చూపిస్తున్నాయన్నారు.

గోద్రెజ్ అగ్రోవెట్ సీఈఓ రాజవేలు ఎన్ కె మాట్లాడుతూ… గ్రాసియా ట్రాన్స్‌లామినార్ చర్య ఆకు నమిలే అండ్ రసం పీల్చే పురుగులు రెండింటినీ సమర్థవంతంగా నియంత్రిస్తుందన్నారు. ఆకుల కింద దాక్కున్న వాటిని కూడా ఇది నిరోధిస్తుందన్నారు. ఈ సమగ్ర రక్షణ మిరప మొక్కలు వాటి అభివృద్ధి దశల్లో ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందన్నారు. అందువల్ల సరైన ఫలితాల కోసం తాము ఎకరానికి 160 మిల్లీ లీటర్ల గ్రాసియాని 2 సార్లు వినియోగించటం కోసం సిఫార్సు చేస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement