అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశమంతా దీనికి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తోంది. అయోధ నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభించడంతో దేశం నలుమూలల నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. అయాెెధ్యపై ప్రత్యేకంగా కేంద్రీకరించి అనేక సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.
ప్రధానంగా రియాల్టి సంస్థలు అయోధ్యపై కేంద్రీకరిస్తున్నాయి. రామాలయానికి వస్తున్న ప్రచారంతో రియాల్టి సంస్థలు భారీగా అయోధ్యలో కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో అయోధ్య చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా భూముల ధరలు అకాశానికి దూసుకెళ్లాయి. చాలా ప్రాంతాల్లో రేట్లు 5 నుంచి 10 రేట్లు పెరిగాయని పలు రియల్ ఎస్టేట్ సంస్థలు తెలిపాయి.
కొన్ని చోట్ల ఈ రేట్లు 900 శాతానికి పైగా పెరిగాయి. రాముడి దేవాలయం ప్రారంభమైతే పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తారని భావిస్తున్నారు. ఆ సమయానికి రేట్లు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యతో పాటు, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
రామాలయం, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మూలంగా పెద్ద సంఖ్యలో హోటల్స్, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలు వస్తాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఆధ్యాత్మిక టూరిజంతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న అనేక వ్యాపారాలు భారీగా విస్తరిస్తాయని, దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అన్నింటికంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు ఎంతో అవకాశం ఉందని భావిస్తున్నారు.