Saturday, November 30, 2024

83 ఏళ్ల మహిళ గర్భాశయ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స

కానూరు : అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ), కానూరు, తీవ్ర స్థాయి గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌తో బాధపడుతున్న 83 ఏళ్ల అల్లాడి రత్తమ్మ అనే మ‌హిళ‌కు విజయవంతమైన చికిత్సతో అధునాతన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో మరో మైలురాయిని సాధించింది.

సిటిఎస్ఐ -దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది, ఏఓఐ బృంద అంకితభావాన్ని ప్రశంసిస్తూ “అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద , రోగి-కేంద్రీకృత చికిత్స ప్రణాళికలపై దృష్టి సారించి క్యాన్సర్ సంరక్షణ పరంగా అత్యున్నత ప్రమాణాలతో చికిత్స అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. సంక్లిష్ట పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న వృద్దులకు సైతం అధునాతన సాంకేతికత మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణ విజయవంతమైన ఫలితాలకు ఎలా దారితీస్తుందో చూపటానికి ఈ కేసు ఉదాహరణగా నిలుస్తుంది “అని అన్నారు.

ఏఓఐ కానూరు వద్ద రేడియేషన్ ఆంకాలజిస్ట్, డాక్టర్ సి. సాయి స్నేహిత్ మాట్లాడుతూ…. “శ్రీమతి రత్తమ్మ కేసు గర్భాశయ క్యాన్సర్‌లకు ముందస్తు రోగనిర్ధారణ మరియు అధునాతన మల్టీడిసిప్లినరీ చికిత్స క్లిష్టమైన అవసరాన్ని వెల్లడిస్తుంది. మా విధానం ద్వారా ఆమెకు చికిత్స ప్రభావవంతంగా ఉంటుంది, దుష్ప్రభావాలను తగ్గించడం ద్వారా ఆమె తన జీవన నాణ్యతను తిరిగి పొందేందుకు వీలు కల్పించిందని నిర్ధారిస్తుంది..” అని అన్నారు.

ఈ విజయగాథకు , ఏఓఐ ఆంధ్రప్రదేశ్, ఆర్ సిఓఓ, మహేందర్ రెడ్డి జోడిస్తూ, “ఈ విజయం ప్రపంచ స్థాయి క్యాన్సర్ కేర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతను బలపరుస్తుంది. మా బృందం నైపుణ్యం మరియు ఏఓఐ కానూరులోని అత్యాధునిక సౌకర్యాలు ఇలాంటి క్లిష్టమైన కేసులను ఖచ్చితత్వంతో మరియు కరుణతో పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయి ” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement