Thursday, November 14, 2024

WhatsApp Ban | 80 లక్షల వాట్సప్‌ ఖాతాలపై నిషేధం..

ప్రపంచ వ్యాప్తంగా వాల్సప్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. మన దేశంలోనూ వాట్సప్‌ యాప్‌ను ఉపయోగించే వారి సంఖ్య కోట్లలోనే ఉంది. దీంతో సైబర్‌ నేరగాళ్లు దీన్ని టార్గెట్‌ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా దుర్వినియోగం చేస్తున్న వారి ఖాతాలపై వాట్సప్‌ చర్యలు తీసుకుంటోంది.

ఒక్క ఆగస్టు నెలలోనే సుమారు 80 లక్షల ఖాతాలను వాట్సాప్‌ నిషేధించింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు వీటిపై చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఐటీ చట్టం 2021 నిబంధనల ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం 84.58 లక్షల ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సప్‌ తెలిపింది.

మోసానికి అస్కారం ఉండే బల్క్‌ మెసేజ్‌లు లేదా అసాధారణ మెసేజ్‌లను వాట్సప్‌ తన ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ ద్వారా ముందుగానే గుర్తించి ఈ చర్యలు తీసుకుంటోంది. ఆగస్టులో గ్రీవెన్స్‌ మెకానిజం ద్వారా యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు అందినట్లు వాట్సప్‌ తెలిపింది.

వాట్సప్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వాట్సప్‌ ఖాతాలపై నిషేధం విధిస్తుంది. మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేతకు బల్క్‌, స్పామ్‌ మెసేజ్‌లు పంపించడం నిబంధనలకు విరుద్ధం. స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా, వాట్సప్‌ చర్యలు తీసుకుంటుంది. అనుచిత ప్రవర్తన, వేధింపులు వంటి విషయాల్లో యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత ఖాతాలను వాట్సప్‌ కూడా నిషేధం విధిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement