Tuesday, November 26, 2024

79,798 కోట్లు పెరిగిన 9 కంపెనీల సంపద

టాప్‌ 10 కంపెనీల్లో 9 కంపెనీల మార్కెట్‌ సంపద గత వారంలో 79,798.3 కోట్ల మేర పెరిగింది. ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీలు అత్యధికంగా లాభపడ్డాయి. గత వారంలో బీఎస్‌ఈ 30 ఇండెక్స్‌ 630.16 పాయింట్లు లాభపడింది. టాప్‌ 10 కంపెనీల్లో ఒక్క అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తప్ప విమిగిలిన అన్ని కంపెనీల మార్కెట్‌ సంపద పెరిగింది. ఇలా సంపద పెరిగిన కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనీలివర్‌ ఉన్నాయి.

టీసీఎస్‌ మార్కెట్‌ విలువ 17,215.83 కోట్లు పెరిగి 12,39,997.62 కోట్లకు చేరుకుంది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ కంపెనీ సంపద 12,535.07 కోట్లు పెరిగి 5,95,997.32 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ సంపద 6,463.34 కోట్లు పెరిగి 6,48,362.25 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్‌ సంపద 5,451.97 కోట్లు పెరిగి 4,71,094.46 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ మార్కెట్‌ సంపద 4,283.81 కోట్లు పెరిగి 5,42,12.54 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ సంపద 2,674.47 కోట్లు పెరిగి 4,87,908.63 కోట్లకు చేరింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంపద మాత్రం 13,281.01 కోట్లు తగ్గి 4,44,982.34 కోట్లకు చేరింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement