న్యూఢిల్లి : భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో విక్రేతల రిజిస్ట్రేషన్ల విషయంలో రికార్డు సృష్టించింది. ఈ మేరకు కంపెనీ బుధవారం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. తాము ఆరు లక్షల విక్రేతల రిజిస్ట్రేషన్‌లను తమ ప్లాట్‌ఫామ్‌పై అధిగమించినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా మీషో సప్లయ్ గ్రోత్ సీఎక్స్‌ఓ లక్ష్మీ నారాయణ్ స్వామి నాథన్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 2021 తరువాత ఏడు రెట్ల వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. భారీ సంఖ్యలో చిరు వ్యాపార సంస్థలు మీషోలో చేరాయని, దీనికి కారణం కంపెనీ ప్రారంభించిన జీరో కమీషన్ అండ్ జీరో పెనాల్టి అని వివరించారు.
హైదరాబాద్ నగరంలో మీషోపై విక్రేతల సంఖ్య పరంగా అత్యంత ఆకర్షణీయంగా ఆరు రెట్ల వృద్ధి నమోదైందన్నారు. దీంతో పాటు మే 2021 నుంచి ఆర్డర్ల సంఖ్య పరంగా ఏడు రెట్ల వృద్ధి ఇక్కడ కనిపించిందన్నారు. ఈ నగరంలో అత్యధికంగా అప్పెరల్, ఆభరణాలు, హోమ్ డెకార్, ఫర్నిషింగ్స్, వ్యక్తిగత సంరక్షణ, వెల్‌నెస్ వంటి ఉత్పత్తులు అమ్ముడుపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..