నాలుగు రోజులుగా సాగుతున్న 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ఇప్పటి వరకు 1,49,966 కోట్లకు బిడ్లు వచ్చాయి. ఆదివారం నాడు కూడా వేలం కొనసాగనుంది. 5జీ వేలలానికి వచ్చిన స్పందనను బట్టి టలికం ఇండస్ట్రీ సమస్యల నుంచి బయటపడి, విస్తరణ దిశగా ముందడుగు వేసిందని అర్ధమవుతోందని టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన వేలంలో 1,49,966 కోట్ల మేర బిడ్లు వచ్చాయని ఆయన ప్రకటించారు. శనివారం నాడు ఆయన టెలికం ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. వేలానికి మంచి స్పందన వచ్చిందని, ఇది పరిశ్రమ ఉన్న తీరును తెలియ చేస్తుందన్నారు.
శనివారం నాడు 111 నుంచి 112 కోట్ల వరకు బిడ్లు వచ్చాయని చెప్పారు. శనివారం నాటికి 31 రౌండ్ల వేలం జరిగింది. అదివారం నాటికి వేలం పూర్తి కావచ్చని టెలికం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్స్ పాల్గొంటున్నాయి.