సార్వభౌమ పసిడి బాండ్ల రెండో దశ పథకం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. పసిడి బాండ్ ఇష్యూ ధరను గ్రాముకు 5,197 రూపాయలుగా నిర్ణయించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఈ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారికి గ్రాముకు 50 రూపాయల రాయితీ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తరపున పసిడి బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈ బాండ్లను ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలతోపాటు బ్యాంక్‌లు, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలల్లో అమ్ముతారు.
కనీసం ఒక గ్రాము, గరిష్టంగా 4 కిలోల వరకు బాండ్ల ద్వారా కొనుగోలు చేయవచ్చని ఆర్బీఐ తెలిపింది. ట్రస్టులు 20 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీమ్‌ను 2015 నవంబర్‌లో ప్ర్ారంభించారు. సేవింగ్స్ చేయాలనుకునే వారు ఈ బంగారు బాండ్లలో తమ పెట్టుబడులు పెట్టవచ్చు. పసిడి బాండ్లను 8 సంవత్సరాల కాలవ్యవధితో జారీ చేస్తున్నారు. 5 సంవత్సరాల తరువాత పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు.