క్లీన్ ఎనర్జీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రంగ స ంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ “(పీఈఎస్‌ఎల్) 80 వేల కోట్లతో 50 వేల ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రజా రవాణా కోసం వీటిని వినియోగించనున్నారు. ప్రజారవాణా విషయంలో కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించాలన్న లక్ష్యంలో భాగంగా విద్యుత్ బస్సులు సమకూర్చనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహు ఆచార్య తెలిపారు. ఈ మేరకు టెండర్లు పిలిచినట్లు ఆయన తెలిపారు. విద్యుత్ బస్సులతో పాటు, అందుకు అవసరమైన మళికసదుపాయాలను కూడా సమకూర్చనున్నారు. దేశం ఎలక్ట్రికల్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఈఎస్‌ఎల్‌ను 2020వ సంవత్సరంలో నాలుగు ప్రభుత్వ రంగ ఎనర్జీ కంపెనీలు కలిపి ఏర్పాటు చేశాయి.
ఈ సంస్థ దేశంలో విద్యుత్ , సోలార్ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. 2030 నాటికి దేశంలో కాలుష్యాన్ని ఒక బిలియన్ టన్నులకు తగ్గించాలని, 2070 నాటికి జీరో స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, పవర్ గ్రిడ్ సామర్ధ్యాలను పెంచుకోవడం, బస్సు డిపోల్లో విద్యుత్ వాహనాల నిర్వాహణ కోసం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో టూ వీలర్ ఈవీ వాహనాల సంఖ్య పెరుగుతోందని, వచ్చే 5 నుంచి 7 సంవత్సరాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో బస్సులన్నీ విద్యుత్ వాహనాలే ఉండేలా చర్యలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆచార్య వివరించారు. ఇప్పటికే 5 రాష్ట్ర ప్రభుత్వాల కోసం సంస్థ 5,450 విద్యుత్ బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడించారు.