జీఎస్‌టీ విషయంలో నష్ట పరిహారాల కోసం కేంద్రంపై ఆధారపడొద్దనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినట్టు తెలుస్తున్నది. ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నాయి. దీని కోసం జీఎస్‌టీలో కీలక మార్పులు చేసేందుకు నిర్ణయించాయి. తరలోనే కేంద్రం జీఎస్‌టీ అమల్లోకి తెచ్చేటప్పుడు చెప్పిన పరిహారం అమలు గడువు ముగియనుంది. దీంతో వచ్చే నెలలో జరిగే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో 5శాతం శ్లాబును ఎత్తేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుతాలు తమ అభిప్రాయాలను ఇప్పటికే జీఎస్‌టీ కౌన్సిల్ ముందు ఉంచాయి.
ప్రజలు ఎక్కువగా ఉపయోగించే కొన్ని ఉత్పత్తులను 3 శాతం శ్లాబులోకి, మరికొన్నింటిని 8 శాతం శ్లాబు పన్ను పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం జీఎస్‌టీ వసూలులో నాలుగు ట్యాక్స్ శ్లాబ్ రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అమల్లో ఉన్నాయి. బంగారం, బంగారు ఆభరణాలు 3 శాతం పన్ను కింద ఉన్నాయి. దీనికితోడు అన్ బ్రాండెడ్, అన్ ప్యాక్ ఫుడ్ ఐటమ్స్ జీఎస్‌టీ పరిధిలోకి రావడం లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..