Saturday, November 23, 2024

TATA-EV | టాటా మోటార్స్‌ నుంచి మరో 5ఈవీలు..

దేశీయ మార్కెట్‌లో విద్యుత్‌ వవాహనాల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా మోటార్స్‌ రానున్న 18 నెలల కాలంలో మార్కెట్లోకి మరో 5 విద్యుత్‌ కార్లను తీసుకురానుంది. అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఆర్కిస్ట్రక్చర్‌ – యాక్టీ ఈవీని ఉపయోగించనున్నట్లు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (టీపీఈఎం) ఇవ్వాల (శుక్రవారం) తెలిపింది. ఈ కొత్త టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న మొదటి వి ద్యుత్‌ కారు పంచ్‌ ఈవీ అని తెలిపింది.

యాక్టీ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్న విద్యుత్‌ కార్లలో అత్యాధునిక ఫీచర్లతో పాటు, స్టైయిల్‌, విభిన్న బాడీ సైజ్‌ల్లో వీటిని రూపొందించేందుకు అవకాశం ఉంది. వచ్చే 18 నెలల కాలంలో ఈ ప్లాట్‌ఫామ్‌పై 5 కంటే ఎక్కువ విద్యుత్‌ మోడల్స్‌ను తీసుకురానున్నట్లు టీపీఈఎం చీఫ్‌ ప్రొడక్ట్స్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ కులకర్ణీ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారుకానున్న విద్యుత్‌ వాహనాల్లో టెక్నికల్‌గా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయని, సాఫ్ట్‌ వేర్‌ ఫీచర్స్‌, బ్యాటరీ సామర్ధ్యం అధికంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వాహనాల్లో వివిధ ఆకృతిలో బ్యాటరీలను అమర్చనున్నట్లు చెప్పారు. ఇవి 300 కి.మీ నుంచి 600 కి.మీ రేంజ్‌ వరకు ఇస్తాయన్నారు. ఫ్రంట్‌ వీల్‌, రేర్‌ వీల్‌, ఆల్‌ వీల్‌ డ్రౖౖెవ్‌ వంటి ఛాయిస్‌లను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ కార్లు ఏసీ, డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇవి 150 కిలోవాట్‌ వరకు ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. 10 నిముషాల ఛార్జింగ్‌లో 100 కి.మీ వరకు ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ నుంచి తయారు కానున్న కార్లు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, భారత్‌ ఎన్‌క్యాప్‌ పరీక్షలకు అనుకూలంగా ఉంటాయి. యాక్టీ ఈవీ రెండు అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెం న్స్‌ సిస్టమ్స్‌ను రూపొందించగలదు.

- Advertisement -

పంచ్‌ ఈవీ బుకింగ్స్‌ ప్రారంభం…

టాటా మోటర్స్‌ నుంచి మార్కెట్‌లోకి వస్తున్న పంచ్‌ ఈవీ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ కారు నాలుగు రంగుల్లో లభించనుంది. నాలుగు బోర్డు వారింటీలతో వస్తోంది. పంచ్‌ ఈవీ, పంచ్‌ ఈవీ లాంగ్‌ రేంజ్‌ పేరుతో రెండు వేరియంట్స్‌లో ఇది లభిస్తుంది. ఈ రెండు వేరియంట్స్‌లోనూ ఎంపవర్డ్‌ ప్లస్‌, ఎంపవర్డ్‌, అడ్వెంచర్‌ ఆఫ్షన్స్‌తో పాటు సన్‌రూఫ్‌, నాన్‌ సన్‌రూఫ్‌లో లభిస్తాయి.

ఈ కారుతో పాటు 7.2 కిలోవాట్‌ ఫాస్ట్‌ హోం ఛార్జర్‌, 3.3 కిలోవాట్‌ వాల్‌బ్యాంక్స్‌ ఛార్జర్‌తో లభిస్తుంది. పంచ్‌ ఈవీలో 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉంటాయి. పంచ్‌లో చాలా ఆధునిక ఫీచర్లను ఇస్తున్నారు. బ్లండ్‌ స్పాట్‌ మిర్రర్‌, వెంటిలేడెట్‌ సీట్లు, యాప్‌, వైర్‌లెస్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జర్‌, 26 సెంటీమీటర్ల డిజిటల్‌ కాక్‌పిట్‌ వంటివి అనేకం ఉన్నాయి. పంచ్‌ ఈవీని 21 వేల రూపాయలతో బుక్‌ చేసుకోవచ్చు. వీటి ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement