Tuesday, November 26, 2024

ఎయిర్‌టెల్‌ లాభాల్లో 466 శాతం పెరుగుదల

టెలికం రంగంలో పేరుమోసిన భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో భారీ పెరుగుదల కన్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,607 కోట్లు లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సాధించిన ఆదాయంతో పోలిస్తే ఇది 466 శాతం అధికం. మొత్తంమీద ఎయిర్‌టెల్‌ సాధించిన ఆదాయం 32,805 కోట్లు కాగా గత ఏడాదితో (రూ.27,064) పోలిస్తే 21 శాతం అదనంగా వచ్చింది. భారత్‌లో మొబైల్‌ ఫోన్‌ సర్వీసుల ఆదాయంలోనూ ఇదే తరహాలో ఆదాయం పెరిగింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.14,305.6 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.18,220 కోట్లు వచ్చింది. వినియోగదారుల సంఖ్య బాగా పెరగడంతో లాబాలు పెరిగినట్లు యాజమాన్యం ప్రకటించింది. కాగా ఒక్కో వినియోగదారుడినుంచి వచ్చిన సగటు ఆదాయంలోనూ పెరుగుదల నమోదైంది. గత ఏడాది తొలి త్రైమాసికంలో ఒక్కో వినియోగదారుడినుంచి వచ్చిన సగటు ఆదాయం రూ.146 కాగా ఇప్పుడు రూ. 183కు పెరిగింది.

మరోవైపు టెలికం రంగంలో ప్రత్యర్థి సంస్థలైన రిలయన్స్‌ జియో, వోడా ఫోన్ల కన్నా ఎక్కువగా ఎయిర్‌టెల్‌కు లాభాలు వచ్చాయి. జియోకు సగటు వినియోగదారుడినుంచి వచ్చిన ఆదాయం రూ. 175.7 కాగా వోడా ఫోన్‌కు రూ.128గా ఉంది. ఈ త్రైమాసికంలో బ్రహ్మాండమైన లాభాలు వచ్చాయని, 4.5 స్థిరమైన అభివృద్ధి మునుముందూ కొనసాగిస్తామని ఎయిర్‌టెల్‌ ఎండీ-సీఈఓ గోపాల్‌ విట్టల్‌ ధీమా వ్యక్తం చేశఆరు. దేశంలో త్వరలో 5జి సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇది శుభపరిణామమని అన్నారు. 4జి విభాగంలో తమ వినియోగదారుల సంఖ్య 20.8 మిలియన్లకు చేరుకుందని, మొబైల్‌ డేటా వినియోగంలో 16.6 శాతం పెరుగుదల కన్పించిందని, నెలకు సగటున 19.5 గిగా బైట్ల చొప్పున వాడారని ప్రకటించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement