మన స్టాక్‌మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి చూపిస్తున్నారు. ఆగస్టులోఇప్పటి వరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మన స్టాక్ మార్కెట్లలో 44,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుండటం, డాలర్ ఇండెక్స్ పడిపోవడం వంటి కారణాలతో మళ్లి వీరు మన మార్కెట్లలో ప్రవేశిస్తున్నారు. జులైలో కేవలం 5 వేల కోట్ల విలువైన కొనుగోళ్లు మాత్రమే చేసిన ఇన్వెస్టర్లు, ఆగస్టులో జోరు పెంచారు. ఇది రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వరసగా 9 నెలల పాలు మన స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఎఫ్‌ఐఐలు ఉపసంహరిస్తూ వచ్చారు. మొదటిసారిగా జులైలోనే స్వల్పంగా కొనుగోళ్లు జరిపారు. 2021 అక్టోబర్ నుంచి 2022 జూన్ మధ్య విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి 2.46 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిపారు. ద్రవ్యోల్బణ భయాలు క్రమంగా తగ్గిపోతుండటం , బలమైన కార్పోరేట్ ఆర్థిక ఫలితాలు, కఠినమైన ద్రవ్య విధానాలతో వీరి వైఖరిలో క్రమంగా సానుకూల మార్పు వచ్చింది. ఈ పరిణామాలతో రానున్న రోజుల్లో వీరు మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డాలర్ కదలికలపైనే ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఆధారపి ఉంటాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చిఫ్ ఇన్వెస్టమెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచడంతో స్టాక్ మార్కెట్లు లాభాలు బాటాలో నడుస్తున్నాయి. మన దేశంతో పాటు ఇతర ఆసియా దేశాల్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు భారీగా పెడుతున్నారు.
70 వేల కోట్ల ఉపసంహరణ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి జూన్ త్రైమాసికంలో 70 వేల కోట్లు ఉపసంహరించుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌కు బదులు ఇన్వెస్టర్లు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉండటం, వడ్డీరేట్లు పెరగుతుండటం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు మ్యుూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వడ్డీరేటుపై ఆధారపడే రానున్న కాలంలోనూ డెబిట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ కేటగిరి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎసెట్స్ 14.16 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. త్రైమాసికం చివరి నాటికి 70,213 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.