టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా 2024 మార్చి నాటికి కొత్తగా 400 వీక్లీ విమాన సర్వీస్‌లను పెంచనుంది. శీతాకాలం విమాన సర్వీస్‌ల షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా ఖరారు చేసింది. ఎయిర్ ఇండియా రానున్న 6 నెలల కాలంలో దేశీయంగా 200 వీక్లీ సర్వీస్‌లను పెంచనుంది. ఈ సర్వీస్‌లు ముంబై, ఢిల్లితో పాటు అన్ని ముఖ్యమైన రూట్స్‌లో ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది.
ఇక అంతర్జాతీయ రూట్లలో 200 వీక్లీ సర్వీస్‌లు నడపనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్‌లో 80 ప్రాంతాలకు సర్వీస్‌లను నడుపుతోంది. త్వరలోనే కొత్త ప్రాంతాల వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. దీంతో పాటు ప్రస్తుతం నడుస్తున్న రూట్లలో అంతర్జాతీయ సర్వీస్‌లను మరింత పెంచనున్నట్లు తెలిపింది. ప్రధానంగా సౌత్‌ఈస్ట్ ఏషియా, యూరోప్, అమెరికాలకు సర్వీస్‌లు పెంచనున్నట్లు తెలిపింది. 2024 మార్చి నాటికి 30 వైడ్ బాడీ విమానాలు, 30 తక్కువ బాడీఉన్న విమానాలు చేరుతాయని ఎయిర్ ఇండియా తెలిపింది.