Monday, November 25, 2024

Microsoft | 3 ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా మైక్రోసాఫ్ట్‌

ప్రముఖ టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో మూడు లక్షల కోట్ల డాలర్లు దాటింది. ప్రపంచంలో ఈ కీలకమైన మైలురాయిని దాటిని రెండో కంపెనీ ఇది. మైక్రోసాఫ్ట్‌ షేర్ల విలువ పెరగడంతో ఈ రికార్డు నమోదైంది. ఐఫోన్ల తయారీ కంపెనీ గత సంవత్సరం జూన్‌లో మూడు లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ సాధించిన మొదటి కంపెనీగా నిలిచింది. 2023లో మైక్రోసాఫ్ట్‌ షేరు ధర 57 శాతానికి పైగా పుంజుకుంది. ఈ జోరు ఏడాది కూడా కొనసాగుతోంది. జనవరిలో ఇప్పటి వరక ఏడు శాతానికి పైగా లాభపడింది. అదే సమయంలో నాస్‌డాక్‌ 100 సూచీ 4.6 శాతం పెరిగింది.

కృత్రిమ మేథపై మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు స్టాక్‌ రాణించడానికి కారణమని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓపెన్‌ ఏఐతో కలిసి ఇప్పటికే ఈ కంపెనీ కొత్త ఏఐ టూల్స్‌ను తీసుకు వచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని అత్యాధునిక ఏఐ ఆవిష్కరణలపైనా పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీ పనితీరుపై బలమైన వి శ్వాసంతో ఉన్నారని నిపుణులు అంచనా, త్వరలో మైక్రోసాఫ్ట్‌ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ సారి కంపెనీ మంచి ఫలితాలు ప్రకటిస్తుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement