అమరావతి,ఆంధ్రప్రభ: నూతన ఆర్థిక సంవత్సరం 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్ల అప్పు తీసుకుంది. ఇదేకాకుండా ఏప్రిల్ 3న ఆర్‌బీఐ నుంచి చేబదులుగా రూ.2,000 కోట్ల పైచిలుకు రుణం తీసుకుంది. ఈ అప్పుతో పాటు వివిధ శాఖల బ్యాంకు ఖాతాల నుంచి మళ్లించిన రూ.1,100 కోట్ల సొమ్ముతో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కొంత మేర చెల్లించింది. ఆర్‌బీఐలో సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకున్న రూ.3,000 కోట్ల అప్పు గురువారం ఖజానాలో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందులో వేజ్ అండ్ మీన్స్ అప్పు కింద రూ.2,000 కోట్ల పైచిలుకు తిరిగి ఆర్‌బీఐ తన ఖాతాలో జమ చేసుకునే అవకాశం ఉంది.
ఇదే జరిగితే ఏపీ సర్కారు చేతిలో మిగిలేది ఇంకా రూ.1,000 కోట్లు మాత్రమే. కానీ, పెండింగ్‌లో ఉన్న జీతాలు, పెన్షన్లు రూ.4.000కోట్ల వరకు ఉన్నాయి. ఇంకా రాష్ట్రాల్రకు అప్పుల పరిమితిని కేంద్రం నిర్ణయించలేదు. అందుకే మార్చి నెలాఖరున సీఎం, ఆర్థికశాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లి 2023-24లో అన్ని రాష్ట్రాల్రతో పాటు- రావాల్సిన అప్పుల పరిమితి నుంచి రూ.3,000 కోట్లు ముందుగానే తెచ్చుకున్నారు. కనీసం ఆ అప్పు తెచ్చుకునే వర-కై-నా ప్రభుత్వం రాష్ట్రాన్న్రి నడపలేక పోయిందనే విమర్శలున్నాయి. అందుకే 3న ఆర్‌బీఐ నుంచి రూ.2,000 కోట్ల పైచిలుకు చేబదులుగా తీసుకొంది.