Tuesday, November 26, 2024

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 3.39 లక్షల కోట్లు.. 45 శాతం పెరుగుదల

ఈ సంవత్సరం జూన్‌లో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 3.39 లక్షల కోట్లకు చేరాయి. ఇది గతంతో పోల్చితే 45 శాతం అధికం. ఇందులో కార్పోరేషన్‌ ట్యాక్‌ 1.70 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను 1.67 లక్షల కోట్లు ఉన్నాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జూన్ 16 నాటికి 3 కోట్ల 39 లక్షల 225 రూపాయలు పన్నులు వసూలైనట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది.

ఇదే కాలంలో గత సంవత్సరం ఇవి 2,33,651 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ 1.01 లక్షల కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇది 75,783 కోట్లుగా ఉంది. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లలో 33 శాతం వృద్ధి నమోదైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement