ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : హైదరాబాద్ మెట్రో రైల్ చార్జీలు పెంపుకు ముహుర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. చార్జీల పెంపుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ) ఈ నెల 15 వరకు ప్రజల నుంచి అభియ్రాలను తీసుకుంది. ఎంత వరకు పెంచ వచ్చు? ఎంత పెంచితే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది అని ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుని కొత్త చార్జీలపై సూత్ర ప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమచారం. హెదరాబాద్ మెట్రో ప్రారంభ సమయంలో చార్జీలను నిర్ణయించారు. 2017నవంబర్ 28న నిర్ణయించిన చార్జీలనే ఇప్పటికి అమలు చేస్తండటంతో నిర్వహణ భారంగా మారిందని, ఎల్‌అండ్‌టీ సంస్థ పలుమార్లు చేసిన అభ్యర్థన మేరకు పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చార్జీల పెంపుపై ఏర్పాటైన కమిటీ మెట్రో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు 30 శాతం వరకు పెంపు అనివార్యమని తెలుస్తోంది. డిసెంబర్ రెండవ వారంలో పెంపుపై ఎప్‌ఎప్‌సీ కమిటి ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
25 శాతం పెరగనున్న చార్జీలు..
మెట్రో చార్జీల పెరుగుదలపై ఏర్పాటు చేసిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ 30 శాతం చార్జీలు పెంపునకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని తెలుస్తోంది. 2017లో నిర్ణయించిన చార్జీలనే ఇప్పటికి అమలు చేస్తండటంతో నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలో ఇందులో కనిష్టంగా ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు రూ.10, ఒక కారిడార్ ప్రారంభం నుంచి మరో కాడిడార్ చివరి వరకు వెళ్లినా గరిష్ట రుసుం రూ.60గా ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు రూ.10గా ఉన్న కనిష్ట చార్జి రూ.20గా, గరిష్ట చార్జి రూ. 80గా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.