Saturday, November 23, 2024

అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల పెట్టబడులు 2,440 కోట్లు

విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు అక్టోబర్‌ 3 నుంచి 7వ తేదీ మధ్యలో ఈక్విటీల్లో 2,440 కోట్ల రపాయలు పెట్టుబడులు పెట్టారు. సెప్టెంబర్‌ నెలలో ఎఫ్‌పీఐలు మన ఈక్విటీ మార్కెట్‌లో 7,600 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెంచడంతో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఇలా వెనక్కి తీసుకున్నారు. మళ్లి ఈ నెలలో మొదటివారంలో తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించారు. రానున్న నెలల్లోనూ ఇలానే ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఒడుదుడుకులుగానే ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కోవిడ్‌ తరువాత ఆగస్టు నెలలో అత్యధికంగా విదేశీ పెట్టబడిదారులు మన మార్కెట్‌లో 51,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 2022 జులై కంటే ముందు వరసగా 9 నెలల పాటు మన మార్కెట్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. జులైలోనే మొదటిసారిగా 5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. మళ్లి సెప్టెంబర్‌లో భారీగా అమ్మకాలు జరిపిన పెట్టబడిదారులు , అక్టోబర్‌లో మళ్లి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement