Tuesday, November 12, 2024

24 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నులు.. ఏప్రిల్ 1, అక్టోబర్‌ 8 వరకు 8.98 లక్షల కోట్లు వసూలు

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తొలి ఆరు నెలల కాలంలో 24 శాతం పెరిగాయి. 2022 ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ మధ్య కాలంలో ప్రత్యక్ష పన్నులు 8.98 లక్షల కోట్లు వసూలయ్యాయి. కార్పొరేట్‌ పన్నుల్లో 16.74 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో 32.30 శాత ం పెరుగుదల నమోదైందని కేంద్ర పన్నుల విభాగం తెలిపింది.

రీఫండ్లు, సర్దుబాటు తరువాత ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 7.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చిఏ 16.45 శాతం వృద్ధి చెందినట్లు తెలిపింది. 2022-23 బడ్జెట్‌లో తెలిపిన ప్రత్యక్ష పన్నుల అంచనాల్లో ఇది 52.46 శాతానికి సమానమని పన్నుల విభాగం పేర్కొంది. ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 8 మధ్య 1.53 లక్షల కోట్ల రీఫండ్‌ చేసినట్లు తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నందునే పన్నుల వసూళ్లు పెరిగాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుములు తగ్గినప్పటికీ పన్ను వసూళ్లు పెరగడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement