ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా చమురు కంపెనీలు చాలా కాలంగా రేట్లను సవరించడంలేదు. దీని వల్ల అవి చాలా నష్టపోయాయి. ఈ నష్టాల్లో కొంత మేర తగ్గించేందుకు ప్రభుత్వం 20 వేల కోట్లు సహాయం చేయనుందని సమాచారం. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కొర్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చాలా కాలంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఎలా ఉన్నా దేశంలో మాత్రం పెట్రోల్ , డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచలేదు. ఇందుకు పరిహారంగా ఆయిల్ మంత్రిత్వ శాఖ 28 వేల కోట్లు సహాయం చేయాలని కోరింది. ఆర్థిక శాఖ మాత్రం 20 వేల కోట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ రంగ చమురు సంస్థ మన దేశ అవసరాల్లో
90 శాతం తీరుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ త్రైమాసికంలో చమురు సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.
2023 మార్చితో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్లో ఆయిల్ సబ్సిడీగా 5,800 కోట్లు కేటాయించింది. రసాయన ఎరువుల సబ్సిడీకి 1.05 లక్షల కోట్లు కేటాయించింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఒప్పందం మేరకు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ రేట్లకు చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ, దేశీయంగానే విక్రయిస్తున్నాయి. రిలయన్స్ వంటి ప్రయివేట్ చమురు కంపెనీలు మాత్రం రష్యా ఆఫర్ చేస్తున్న తక్కువ రేటుకే చమురును కొనుగోలు చేస్తూ, అధిక రేట్లకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఫలితంగా ప్రయివేట్ కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు రేట్లు సవరించకపోవడం, దేశీయ మార్కెట్ అవసరాలు కాదని ఎగుమతి చేయలేని పరిస్థితుల్లో భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవలే ప్రభుత్వం చమురు ఎగుమతులపై ఇండ్పాల్ ట్యాక్స్ విధించింది.
తర్జాతీయ ఒప్పందాల ప్రకారం మన దేశం ముఖ్యంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ మేరకే ముడి చమురును, ఎల్పీజీని కొనుగోలు చేస్తున్నాయి. ఎల్పీజీ విషయంలో ఈ రెండు సంవత్సరాల్లో అంతర్జాతీయంగా 303 శాతం పెరిగింది. అదే సమయంలో ఢిల్లిdలో వంట గ్యాస్ ధర 28 శాతం మాత్రమే పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థల నష్టాలను పూడ్చుకోవడానికి రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని, లేకుంటే ప్రభుత్వం ఆ మేరకు పరిహారం ఇవ్వాలని గత నెలలోనే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ విజ్జప్తి చేశారు.