Tuesday, November 26, 2024

స్పైస్‌జెట్‌ పైలట్లకు 20శాతం వేతనం పెంపు

సీనియర్‌ పైలట్లకు స్పైస్‌జెట్‌ శుభవార్త చెప్పింది. 20శాతం మేరకు వేతనాలు పెంచుతున్నట్లు గురువారం వెల్లడించింది. ఇటీవల 80 మంది పైలట్లను మూడునెలలు వేతనరహిత సెలవుపై పంపిన నేపథ్యంలో, తాజా ప్రకటన వెలువడింది. అక్టోబర్‌ నుంచి కొత్తవేతనాలు అమలులోకి వస్తాయని తెలిపింది. పెంచిన వేతనాలకు కెప్టెన్లు, సీనియర్‌ ఫస్ట్‌ ఆఫీసర్లు అర్హులని ఆపరేషన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గురుచరణ్‌ అరోరా తెలిపారు. పైలట్ల కనీస వేతాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. గత నెలలో లైన్‌ కెపెన్లు 6శాతం అదనపు వేతనాలు పొందారని అరోరా వివరించారు.

ఆకాశా ఎయిర్‌ రంగప్రవేశం, జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్దరణ వల్ల పైలట్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ సంస్థలు పైలట్లకు పెద్దమొత్తంలో చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో స్పైస్‌జెట్‌ తమ పైలట్లకు తీపికబులు చెప్పింది. స్పైస్‌జెట్‌ గత నాలుగేళ్లుగా నష్టాల్లో నడుస్తోంది. జులై 27నుంచి కేవలం 50 శాతం సర్వీసులను మాత్రమే నడుపుతోంది. కేంద్ర ప్రభుత్వపు అత్యవసర రుణ గ్యారంటీ స్కీమ్‌ కింద స్పైస్‌జెట్‌కు రుణం మంజూరైంది. దీంతో సంస్థ పునరుద్ధరణ చర్యలను చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement