ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే పరిమితిని 15 నుంచి 20 శాతానికి పెంచనున్నారు. ఈ నెల 29,30 తేదీల్లో జరగనున్న ఈపీఎఫ్ఓ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చెందిన పైనాన్స్ అడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ (ఎఫ్ఏఐసీ) ఆమోదించింది. ఈ ప్రాతిపానను సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదం కోసం సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆధ్వర్యంలోని ఈ బోర్డు ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనను ఆమోదించనుందని ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఏఐసీ ప్రతిపాదించిందని సోమవారం నాడు కేంద్ర కార్మిక , ఉపాధి కల్పనా శాఖ మంత్రి రామేశ్వర్ తేలి లోకసభకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు.
ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి స్టాక్ మార్కెట్లో 2015 నుంచి పెట్టుబడులు పెడుతున్నారు. తొలుత ఈ పరిమితి 5 శాతంగా ఉంది. తరువాత దీన్ని 15 శాతానికి పెంచారు. ఇప్పుడు ఈ పరిమితిని 20 శాతానికి పెంచనున్నారు. ఈ పెట్టుబడులకు ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వనుందున స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడుల వల్ల 2020-21 సంవత్సరంలో 14.67 శాతం, 2021-22 సంవత్సరంలో 16.27 శాతం రాబడి వచ్చిందని మంత్రి ఆ సమాధానంలో తెలిపారు. 2021-22 వ సంవత్సరంలో చందాదారులు 1,04,959.18 కోట్ల రూపాయలు విత్డ్రా చేశారని మంత్రి వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.